MLC కవిత ఇంట్లో ఐటీ సోదాలు
TS: BRS ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ సహా పలుచోట్ల సోదాలు జరుగుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
వీరిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంది. మొత్తం నాలుగు టీములుగా ఏర్పడి సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కవితతో పాటు.. ఆమె భర్త వ్యాపారాలు, వాటికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన లెక్కలపై ఆరా తీస్తున్నట్టుగా సమాచారం.
కవిత నివాసంతోపాటు హైదరాబాద్ లోని పలుచోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ సోదాల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
సరిగ్గా లోక్ సభ ఎన్నికల ముందు ఐటీ రెయిడ్స్ జరగడం సంచలనంగా మారింది. రేపు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. సరిగ్గా ముందు రోజు కవిత నివాసంలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. తర్వాత సీబీఐ కూడా ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు ఐటీ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయంగా ఇది సంచలనంగా మారింది.