ఖమ్మం నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతా.. మంత్రి తుమ్మల సికే న్యూస్ ప్రతినిధి ఖమ్మం : ఖమ్మం నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మంత్రి నగరంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. 49వ డివిజన్ లో రూ. 70.21 లక్షలతో చేపట్టే సిసి రోడ్, సైడ్ కాల్వల నిర్మాణ పనులకు రామాలయం సెంటర్ వద్ద, 57వ డివిజన్ వికలాంగుల కాలనిలో …

ఖమ్మం నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతా.. మంత్రి తుమ్మల

సికే న్యూస్ ప్రతినిధి

ఖమ్మం : ఖమ్మం నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మంత్రి నగరంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు.

49వ డివిజన్ లో రూ. 70.21 లక్షలతో చేపట్టే సిసి రోడ్, సైడ్ కాల్వల నిర్మాణ పనులకు రామాలయం సెంటర్ వద్ద, 57వ డివిజన్ వికలాంగుల కాలనిలో రూ. 72 లక్షలతో చేపట్టే సిసి రోడ్, సైడ్ కాల్వల నిర్మాణ పనులకు, 5వ డివిజన్ యూపీహెచ్ కాలనిలో రూ. 72 లక్షలతో చేపట్టే సిసి రోడ్, సైడ్ కాల్వల నిర్మాణ పనులకు, 2వ డివిజన్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వద్ద రూ. 72 లక్షలతో చేపట్టే సిసి రోడ్, సైడ్ కాల్వల నిర్మాణ పనులకు, 8వ డివిజన్ గోపాలపురం లో రూ. 72 లక్షలతో చేపట్టే సిసి రోడ్, సైడ్ కాల్వల నిర్మాణ పనులకు, 27వ డివిజన్ శ్రీనివాస నగర్ లో రూ. 74 లక్షలతో చేపట్టే సిసి రోడ్, సైడ్ కాల్వల నిర్మాణ పనులకు, రూ. 25 కోట్ల అంచనాలతో చేపట్టే ఖమ్మం- కొదుమూరు 2 లైన్ల ఆర్ అండ్ బి రహదారిని 4 లైన్ల రహదారిగా అభివృద్ధి, పటిష్ట పరిచే పనులకు మంత్రి శంఖుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
వికలాంగుల కాలనీ వద్ద జరిగిన సిసి రోడ్, సైడ్ కాల్వల శంఖుస్థాపన సందర్భంగా నగరపాలక సంస్థ సిబ్బందికి చెందిన సెప్టిక్ ట్యాoక్ క్లినింగ్ వాహనాన్ని మంత్రి ప్రారంభించారు.

ఇట్టి మెషీనరీని నగరపాలక సంస్థ కు చెందిన లిక్విడ్ వేస్ట్ పై పనిచేసే వారికి, మ్యానువల్ స్కావెంజింగ్ కాకుండా, మిషనరీతో క్లినింగ్ చేసేట్లుగా, నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్షియల్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై రుణ సౌకర్యం ద్వారా అందించబడింది.

ఇట్టి యూనిట్ విలువ రూ. 19.34 లక్షలు కాగా, సబ్సిడీ మొత్తం రూ. 8.50 లక్షలు, సబ్సిడీ పోనూ మిగులు మొత్తం వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. ఇట్టి మెషినరీ నగరపాలక సంస్థ ఎంగేజ్ చేసుకొని, వారికి ఉపాధి కల్పిస్తుంది.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, ఆర్ అండ్ బి ఎస్ఇ శ్యామ్ ప్రసాద్, పీఆర్ ఎస్ఇ చంద్రమౌళి, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణ లాల్, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated On 15 March 2024 9:10 PM IST
cknews1122

cknews1122

Next Story