విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలి… ప్రధానాచార్యులు బండిరాజుల శంకర్ సి కే న్యూస్ (సంపత్) మార్చ్15 కన్న తల్లిదండ్రుల ఆశలు తీర్చడం విద్యార్థులు తమ కర్తవ్యంగా భావించాలని శ్రీ రామకృష్ణ విద్యాలయం ప్రధానాచార్యులు బండిరాజుల శంకర్ అన్నారు.శుక్రవారం రోజున పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడుకోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..తమ కోరికలను చంపుకొని, తమ సుఖాన్ని పక్కన పెట్టి తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే తల్లిదండ్రుల ఋణం తీర్చలేనిదని అన్నారు. సోమవారం నుండి …

విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలి…

ప్రధానాచార్యులు బండిరాజుల శంకర్

సి కే న్యూస్ (సంపత్) మార్చ్15

కన్న తల్లిదండ్రుల ఆశలు తీర్చడం విద్యార్థులు తమ కర్తవ్యంగా భావించాలని శ్రీ రామకృష్ణ విద్యాలయం ప్రధానాచార్యులు బండిరాజుల శంకర్ అన్నారు.శుక్రవారం రోజున పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడుకోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..తమ కోరికలను చంపుకొని, తమ సుఖాన్ని పక్కన పెట్టి తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే తల్లిదండ్రుల ఋణం తీర్చలేనిదని అన్నారు.

సోమవారం నుండి జరుగబోయే పదవ తరగతి పరీక్షలు బాగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.కార్యక్రమంలో విద్యార్థులు తమ అనుభవాలను నెమరు వేసుకొన్నారు. విద్యార్థులు తమకు బోధించిన ఆచార్యులను సన్మానించారు


ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ తరిగొప్పుల రమేశ్, ఆచార్యులు జూకంటి సిద్ధులు, నారగోని భీమేశ్, బొడ్డు రమేశ్, గుగ్గిళ్ళ జయమ్మ, మాడిశెట్టి వాణిశ్రీ,కడారి పరమేశ్వరి,కాయితి అన్నపూర్ణ, అంబాల ప్రసన్నలక్ష్మి,పెండెం విజయ భవాని,అప్పాల స్వరూప, మైలబోయిన పావని, ఆత్మకూరి దీపిక, యెనగందుల కవిత, యానాల సరస్వతి, గుండు లలిత, వంగపల్లి శ్వేత, పిడిశెట్టి భవాని పాల్గొన్నారు.

Updated On 15 March 2024 7:45 PM IST
cknews1122

cknews1122

Next Story