బాల్య వివాహల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్
ఖమ్మం :
బాల్య వివాహల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మహిళా,శిశు, వికలాంగులు,వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో బాల్య వివాహాల నిర్మూలన, బాలల సంక్షేమ సమితి,జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణలో ఉన్న శిశువుల వివరాలు,పిల్లల దత్తతపై ఆయన సమీక్షించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల సంక్షేమ సమితి,బాలల పరిరక్షణగా విభాగం,చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సభ్యులకు సమావేశం నిర్వహించారు.దీనిలో భాగంగా బాలల సంక్షేమ సమితి యందు హాజరైనటువంటి పిల్లలు ఎంతమంది బాల్యవివాహాల గురించి,ఎంతమంది అటువంటి కేసులు మన దృష్టికి రాగానే ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లు ఎన్ని?
ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అటువంటి పిల్లలు గురించి అడిగి తెలుసుకున్నారు. బాల్యవివాహాలు ఎక్కువగా వస్తున్నటువంటి మండలాల మీద దృష్టి పెట్టాలన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098 వచ్చినటు వంటి కాల్స్ సమాచారం పూర్తి వివరాలతో నమోదు చేసుకోవాలన్నారు.ప్రతి నెల ఫాలో అప్ చేయాలన్నారు. బాల్యవివాహాలు అయినట్లు గుర్తించితే వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలన్నారు.బాల్య వివాహం జరిగిందని తెలిస్తే మండల తహసీల్దారుల చేత బైండవర్ చేయించి ఒక లక్ష వరకు ప్రభుత్వానికి కట్టించే విధంగా బైండ్వరు చేయించాలన్నారు.
అది బ్రేక్ చేసిన వారి మీద చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. దత్తతకి దరఖాస్తు చేసుకోవాలనుకున్న దంపతులకు అవగాహన కల్పించి వారు దరఖాస్తు చేసుకునేలా వారికి వివరాలు తెలియజేయలన్నారు . దరఖాస్తు చేసుకున్న దంపతులు నిర్వహించే గృహ అధ్యయన రిపోర్ట్ సకాలంలో నిర్వహించాలనారు.దత్తతకి వచ్చిన పిల్లల రిపోర్టు కూడా సకాలంలో నిర్వహించాలి. ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్లు రెస్క్యూ అయిన పిల్లల యొక్క ప్రస్తుత స్థితి గురించి అడిగి తెలుసు కున్నారు.
ఈకార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్ రెడ్డి,డి.సి. పి.ఓ. విష్ణు వందన,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు లక్ష్మయ్య, లింగయ్య,అనిత తదితరులు పాల్గొన్నారు.