కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత పీఆర్వో రాజేష్‌,ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులిచ్చింది. సోమవారం హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. నిన్న కవిత ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో ఐదుగురు సెల్‌ఫోన్లు ఈడీ అధికారులు సీజ్‌ చేశారు. కాగా, లిక్కర్‌ కేసులో అరెస్టైనబీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్‌ విధించింది రౌస్‌ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్టు అక్రమమని కవిత …

కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు

కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత పీఆర్వో రాజేష్‌,ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులిచ్చింది. సోమవారం హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.

నిన్న కవిత ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో ఐదుగురు సెల్‌ఫోన్లు ఈడీ అధికారులు సీజ్‌ చేశారు.

కాగా, లిక్కర్‌ కేసులో అరెస్టైనబీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్‌ విధించింది రౌస్‌ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్టు అక్రమమని కవిత తరఫు లాయర్ల వాదనను కోర్టు తిరస్కరించింది.

ఈ క్రమంలో రిమాండ్‌ విధిస్తూ.. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది.

అలాగే రిమాండ్‌లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే.. ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది.

Updated On 16 March 2024 8:09 PM IST
cknews1122

cknews1122

Next Story