నూతన కోర్టు నిర్మాణానికి భూమి కేటాయింపు… మంత్రి ఉత్తమ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన న్యాయమూర్తులు సికె న్యూస్ ప్రతినిధి హుజూర్ నగర్ మంత్రి చిత్రపటానికి పాలాభిషేకంగత అసెంబ్లీ ఎన్నికల సమయంలో న్యాయవాదులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మాత్యులు శ్రీ కెప్టెన్ నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో నిర్మించ తలపెట్టిన నూతన కోర్టు మరియు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు రామస్వామి గట్టు వద్ద రెండు ఎకరంల …

నూతన కోర్టు నిర్మాణానికి భూమి కేటాయింపు…

మంత్రి ఉత్తమ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన న్యాయమూర్తులు

సికె న్యూస్ ప్రతినిధి హుజూర్ నగర్

మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో న్యాయవాదులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మాత్యులు శ్రీ కెప్టెన్ నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో నిర్మించ తలపెట్టిన నూతన కోర్టు మరియు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు రామస్వామి గట్టు వద్ద రెండు ఎకరంల 35 కుంటల స్థలమును కేటాయించడం

దానిని జిల్లా ప్రధాన న్యాయమూర్తికి స్వాధీన పరుస్తూ తగిన ధ్రువ పత్రములు అందజేయించినందుకు కృతజ్ఞతగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక న్యాయస్థానం ముందు న్యాయవాదులు మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రామిరెడ్డి, పలువురు జూనియర్, సీనియర్ న్యాయవాదులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

Updated On 16 March 2024 8:41 PM IST
cknews1122

cknews1122

Next Story