ఈ సభను చూస్తోంటే నాకు విశాఖలో కాదు.. హైదరాబాద్ సభలో ఉన్నట్టుంది.. భౌగోళికంగా విడిపోయినా తెలుగువాళ్ళుగా మనమంతా ఒక్కటే.. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఏపీ, తెలంగాణ.. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మనం తెలుగువాళ్ళం.. ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా తెలుగు గడ్డపై ఒక్క ఇటుక పెల్లను కూడా తీయలేరు.. విశాఖ ఉక్కును ఇక్కడి నుంచి కదిలించలేరు… వైఎస్ఆర్ వారసులు ఎవరు అనే అనుమానం మీకు ఉండొచ్చు… వైఎస్సార్ సంకల్పం నిలబెట్టేవారే ఆయన వారసులు వైఎస్ ఆశయాలకు వ్యతిరేకంగా …

ఈ సభను చూస్తోంటే నాకు విశాఖలో కాదు.. హైదరాబాద్ సభలో ఉన్నట్టుంది..

భౌగోళికంగా విడిపోయినా తెలుగువాళ్ళుగా మనమంతా ఒక్కటే..

ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఏపీ, తెలంగాణ.. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మనం తెలుగువాళ్ళం..

ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా తెలుగు గడ్డపై ఒక్క ఇటుక పెల్లను కూడా తీయలేరు..

విశాఖ ఉక్కును ఇక్కడి నుంచి కదిలించలేరు…

వైఎస్ఆర్ వారసులు ఎవరు అనే అనుమానం మీకు ఉండొచ్చు…

వైఎస్సార్ సంకల్పం నిలబెట్టేవారే ఆయన వారసులు

వైఎస్ ఆశయాలకు వ్యతిరేకంగా పని చేసేవారు ఎలా వారసులు అవుతారు?

ఢిల్లీలో ఉన్న మోదీ ఈ ప్రాంతంపై ఆధిపత్యం చలాయించాలనుకుంటున్నారు

ఇక్కడి ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తున్నారు..

ఏపీలో మోదీని ప్రశ్నించే గొంతులు లేవు..

పదేళ్లుగా రాజధాని ఏంటో చెప్పలేని పరిస్థితి ఇక్కడి ప్రజలది.

ఇక్కడి పాలకులు ఈ ప్రాంతపు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు

ఢిల్లీని అడిగి మన హక్కులను సాధించుకునే నాయకులు లేరు..

వైఎస్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదలను ఆదుకున్నారు.

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్..

ఎవరు గెలిచినా మోదీకి మద్దతు ఇచ్చేవారే తప్ప మోదీతో కొట్లాడే వారు లేరు

వెన్నెముక లేని నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరించలేదు

నిటారుగా నిలబడి కొట్లాడే నాయకత్వమే మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది..

ఏపీ ప్రజలకు అండగా నిలబడాలనే షర్మిలమ్మ వచ్చింది..

రాహుల్ గాంధీని ప్రధాని చేయడం.. కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే వైఎస్ చివరి కోరిక

ఏనాడు కూడా వైఎస్ బీజేపీ వైపు నిలబడలేదు..

వైఎస్ వారసులమని చెప్పుకుంటున్నవారు ఇవాళ ఎవరివైపు నిలబడ్డారు..?

వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ…

వైఎస్ నిజమైన వారసురాలు షర్మిలమ్మ..

మోదీని ఎదిరించి నిలబడే శక్తి బాబు, జగన్, పవన్ కు లేదు

పాలించే నాయకులు కాదు… ప్రశ్నించే గొంతు కావాలి..

మీ తరపున కొట్లాడే నాయకులు కావాలి… వైఎస్ వారసురాలు కావాలి..

చట్ట సభల్లో కాంగ్రెస్ కు, షర్మిలమ్మకు అవకాశం ఇవ్వండి..

నిజమైన వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచన చేయండి…

ఇక్కడ కాంగ్రెస్ లేదు అని కొందరు అనుకుంటున్నారు… కానీ ఈ సభను చూశాక షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయం అనిపిస్తోంది..

షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి… అండగా నేనుంటా…

ఆంధ్రప్రదేశ్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం..

Updated On 16 March 2024 8:08 PM IST
cknews1122

cknews1122

Next Story