రూ.100 కోట్లతో మోడల్ మార్కెట్ నిర్మాణం: మంత్రి
ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కార్మికులకు ఏకరూప దుస్తులను శనివారం అందజేశారు. రైతు వ్యవసాయం వదిలేస్తే ఆహార సంక్షోభం ఏర్పడుతుందని, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంకలో సంక్షోభం చూస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు చేయూతనివ్వాలని చెప్పారు. కర్షకులకు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు రూ.100 కోట్లతో రాష్ట్రంలోనే మోడల్ మార్కెట్‌ను ఖమ్మంలో త్వరలో నిర్మించనున్నట్లు వెల్లడించారు.
మార్కెట్‌లో ఆర్‌డీ, జీరో లాంటి అక్రమాలకు తావు లేకుండా సజావుగా నిర్వహించాలని మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. మార్కెటింగ్‌శాఖ సంచాలకురాలు లక్ష్మీబాయి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏటా ఉచితంగా దుస్తులు అందజే స్తున్నారు. గతేడాది పత్తి మార్కెట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో శ్రీశివగణేశ్ కృష్ణ ట్రేడర్స్‌కు చెందిన 2,300 బస్తాల పత్తి ఆహుతైంది. సంబంధిత బీమా కంపెనీతో మాట్లాడి వ్యాపారికి పరిహారం కింద చెక్కును మంత్రి తుమ్మల పంపిణీ చేశారు. మార్కెటింగ్‌శాఖ వరంగల్ జేడీ మల్లేశం, డీడీ రాజు, డీఎంఓ అలీం, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నల్లమల వెంకటేశ్వరరావు, మానుకొండ రాధాకిశోర్, కార్పొరేటర్ సరిత, దిగుమతిశాఖ అధ్యక్షుడు దిరిశాల చిన వెంకటేశ్వర్లు, ఎగుమతిశాఖ అధ్యక్షుడు నల్లమల ఆనంద్ పాల్గొన్నారు.