పదవ తరగతి పరీక్షలకు కఠిన ఆంక్షలు ప్రశ్న పత్రం పై హాల్ టికెట్ నెంబర్ రాయాలని ఎస్సెస్సీబోర్డు ఆదేశాలు హైదరాబాద్:ప్రతినిధి హైదరాబాద్‌:మార్చి17పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారం భంకానుండగా, ఏప్రిల్‌ 2న ముగుస్తాయి. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 :30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణకు అధి కారులు ఏర్పాట్లు పూర్తిచే శారు. అయితే, కాపీయింగ్‌ నివారణకు అధికారులు కీలకనిర్ణయం తీసుకొన్నా రు. విద్యార్థికి ప్రశ్నపత్రమి వ్వగానే …

పదవ తరగతి పరీక్షలకు కఠిన ఆంక్షలు

ప్రశ్న పత్రం పై హాల్ టికెట్ నెంబర్ రాయాలని ఎస్సెస్సీబోర్డు ఆదేశాలు


హైదరాబాద్:ప్రతినిధి

హైదరాబాద్‌:మార్చి17
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారం భంకానుండగా, ఏప్రిల్‌ 2న ముగుస్తాయి. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 :30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

పరీక్షల నిర్వహణకు అధి కారులు ఏర్పాట్లు పూర్తిచే శారు. అయితే, కాపీయింగ్‌ నివారణకు అధికారులు కీలకనిర్ణయం తీసుకొన్నా రు. విద్యార్థికి ప్రశ్నపత్రమి వ్వగానే ప్రతి పేజీపై తన హాల్‌టికెట్‌నంబర్‌ను రాయాల్సి ఉంటుంది.

ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా ఉండటంలో భాగంగా ఈ నిర్ణయం తీసు కొన్నారు. ఇక విద్యా ర్థులు, సిబ్బంది పరీక్ష ముగిసే వర కు పరీక్ష కేంద్రాలను విడిచి బయటికెళ్లరాదని ఆదేశిం చారు.

విద్యార్థులకు ఎగ్జామ్‌ ప్యాడ్‌, పెన్‌, పెన్సిల్‌, స్కేల్‌, షార్ప్‌నర్‌, ఎరేజర్‌, జామెట్రీ పరికరాలను అనుమతి స్తారు. సెల్‌ఫోన్లు సహా ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకర ణాలను తీసుకెళ్లడం పూర్తి గా, నిషేధించారు…

విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడితే డిబార్‌ చేస్తారు. ఇందులో సిబ్బంది పాత్ర ఉంటే వారిపై యాక్ట్‌ -25, 1997 సీసీఏ రూల్స్‌ ప్రకారం చర్యలుంటాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు హెచ్చరించారు.

Updated On 17 March 2024 9:20 AM IST
cknews1122

cknews1122

Next Story