రాష్ట్రంలో మరో సంచలనం గవర్నర్ పదవికి తమిళి సై రాజీనామా
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పంపించారు.
కాగా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని చెన్నై సెంట్రల్ నుంచి ఆమె లోక్‌సభకు పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఆమె బీజేపీ పెద్దలతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు.