మంగ్లీ కారును ఢీకొన్న డీసీఎం.. త్రుటిలో తప్పిన ప్రమాదం ప్రముఖ గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొన్న ఘటన శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో చోటు చేసుకుంది. అయితే త్రుటిలో ప్రమాదం తప్పింది. శంషాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరై అర్ధరాత్రి తర్వాత మేఘ్రాజ్, మనోహర్తో కలిసి ఆమె కారులో హైదరాబాద్-బెంగళూర్ జాతీయ రహదారి మీదుగా ఇంటికి …

మంగ్లీ కారును ఢీకొన్న డీసీఎం..

త్రుటిలో తప్పిన ప్రమాదం

ప్రముఖ గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొన్న ఘటన శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో చోటు చేసుకుంది. అయితే త్రుటిలో ప్రమాదం తప్పింది.

శంషాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరై అర్ధరాత్రి తర్వాత మేఘ్రాజ్, మనోహర్తో కలిసి ఆమె కారులో హైదరాబాద్-బెంగళూర్ జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయల్దేరారు.

తొండుపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వ్యాన్ వెనక నుంచి వేగంగా వచ్చి వీరి కారును ఢీకొట్టడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనక భాగం దెబ్బతింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు.

Updated On 18 March 2024 9:41 AM IST
cknews1122

cknews1122

Next Story