ప్రిన్సిపల్ అసభ్యంగా మాట్లాడుతున్నారు కొత్తగూడెంలో మెడికోల ఆందోళన , భద్రాద్రి కొత్తగూడెం: క్రమశిక్షణ పేరుతో కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ లక్ష్మణరావు తమతో అసభ్యంగా మాట్లాడుతూ, మానసికంగా వేధిస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన ఆందోళన మూడు గంటల పాటు కొనసాగింది. 300 మంది విద్యార్థులు ఆందోళనలో పాల్గొని, కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ కూడా ధర్నా చేశారు. ప్రిన్సి పల్ లక్ష్మణ్ రావు అక్కడకు చేరుకుని 'మీరు …

ప్రిన్సిపల్ అసభ్యంగా మాట్లాడుతున్నారు

కొత్తగూడెంలో మెడికోల ఆందోళన

, భద్రాద్రి కొత్తగూడెం: క్రమశిక్షణ పేరుతో కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ లక్ష్మణరావు తమతో అసభ్యంగా మాట్లాడుతూ, మానసికంగా వేధిస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన ఆందోళన మూడు గంటల పాటు కొనసాగింది. 300 మంది విద్యార్థులు ఆందోళనలో పాల్గొని, కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ కూడా ధర్నా చేశారు. ప్రిన్సి పల్ లక్ష్మణ్ రావు అక్కడకు చేరుకుని 'మీరు చదువు తున్న కాలేజీకి మచ్చ తెస్తున్నారు అంటూ మండిప డ్డారు. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేయగా కొంచెం వెనక్కి తగ్గారు.

అగిరాజుకుంది ఇలా..

ఇటీవల కాలేజీ ఫెస్టివల్ నిర్వహించేందుకు తేదీలు ప్రకటించగా, చివరి నిమిషంలో రద్దు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రకటించారు. దీంతో ఏడాది కాలంగా

కొత్తగూడెంలోని వైద్య కళాశాల ఎదుట ధర్నా చేస్తున్న మెడికోలు

ప్రిన్సిపల్ వేధింపులు భరిస్తున్నామంటూ మెడి కోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థినులు మాట్లాడుతూ మెడికల్ కాలే జీకి పక్కా భవనాలు అందుబాటులోకి రాకపోవ డంతో నర్సింగ్ కాలేజీ భవనంలో మెడికల్ కాలేజీ, పాల్వంచలో హాస్టళ్లు ఏర్పాటు చేశారని తెలిపారు.

అయితే, రాత్రి ప్రిన్సిపల్ తమ హాస్టల్ గదులకు తరచుగా వస్తూ 'నైట్ డ్రస్ ఉన్న తమతో 'ఇలాం టి పొట్టిపొట్టి బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు. మీ ఇంట్లో మిమ్మల్ని ఇలానే పెంచారా.. ఇంట్లో మీ అమ్మలు కూడా ఇలాంటి బట్టలే వేసుకుంటారా' అని తిడుతున్నారని వాపోయారు.

Updated On 19 March 2024 8:33 AM IST
cknews1122

cknews1122

Next Story