ఎస్సి 57 ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి…బందెల విష్ణు
సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 19
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ 57 ఉప కులాలకు కార్పొరేషన్ ఏర్పాటులో స్పష్టత ఇవ్వాలని ఎస్సీ 57 ఉపకులాల పోరాట సమితి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు బందెల విష్ణు మాదాసి కురువ డిమాండ్ చేశారు.
గత ఎన్నికల్లో చేవెళ్ల డిక్లరేషన్ లో మాదిగలకు ఒక కార్పొరేషన్ మాలలకు ఒక కార్పొరేషన్
మిగతా ఎస్సీ 57 ఉపకులాలకు ఒక కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏర్పాటు చేస్తామని మల్లికార్జున ఖర్గే సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారని గుర్తు చేశారు.
ఇప్పుడు ప్రకటించిన ఉమ్మడి కార్పొరేషన్ వల్ల దళితులలోని 57 ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉప కులాలు కనుమరుగు అయ్యేపరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కావున తక్షణమే దళితులలో భాగమైన 57 ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు
లేనియెడల వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఉప కులాలు తగిన బుద్ధి చెబుతాయని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఎస్సీ 57 ఉపకులాల జిల్లా నాయకులు బెదరకోట దుర్గేశ్వర్ మోచి నియోజకవర్గ నాయకులు చంద్రగిరి లింగం మోచి ఆసిసేరి సరి అశోక్ మోచి బెదిరకోటి రమేష్ మోచి దర్శనం శ్రీనివాస్ మాస్తిన్ పిల్లుట్ల కుమార్ చిందు తదితరులు పాల్గొన్నారు..