ఆస్పత్రుల్లో హైదరాబాద్ బృందం తనిఖీ
- రెండు దవాఖానాల సీజ్, ఐదింటికి నోటీసులు
అనుమతి లేక, నిబంధనలు
పాటించక పోవడమే కారణం
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా కేంద్రంలోని పలు సం తాన సాఫల్య కేంద్రాలతో వివిధ ఆస్పత్రుల్లో హైద రాబాద్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌కు చెందిన బృం దం సోమవారం తనిఖీలు నిర్వహించింది. ఈసంద ర్భంగా సరైన పత్రాలు, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రెండు ఆస్పత్రులను సీజ్ చేశారు. ఈమేరకు శ్రీఫెర్టిలిటీ సెంటర్, భారతి టెస్ట్యూబ్ బేబీ సెంటర్లను సీజ్ చేసిన అధికారులు సోమ
ఆస్పత్రిని సీజ్ చేస్తున్న అధికారుల బృందం
వారం రాత్రి వెల్లడించారు. అలాగే, సరైన అనుమ తులు లేకపోవడం, అర్హత కలిగిన వైద్యులను నియ మించకపోవడం తదితర కారణాలతో ప్రవీణ, జోయా, లావణ్య, మాతృశ్రీ, బిలీఫ్ ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.