పెళ్ళి చూపులతో అడ్డంగా దొరికిన నకిలీ లేడీ ఎస్‌ఐ.. ఏడాది కాలంగా నకిలీ ఎస్‌ఐగా(Fake RPF SI) చెలామణి అవుతున్న యువతిని సికింద్రాబాద్‌ (Secunderabad)పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే..నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది.2018లో అర్.పి.ఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసి దాదాపు అన్ని అర్హతలు సాధించింది. కానీ మెడికల్ చెకప్‌లో దృష్టి లోపం కారణంగా తిరస్కరణకు గురైంది. అయితే అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధువులకు తాను ఎస్ఐ …

పెళ్ళి చూపులతో అడ్డంగా దొరికిన నకిలీ లేడీ ఎస్‌ఐ..

ఏడాది కాలంగా నకిలీ ఎస్‌ఐగా(Fake RPF SI) చెలామణి అవుతున్న యువతిని సికింద్రాబాద్‌ (Secunderabad)పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వివరాల్లోకి వెళ్తే..నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది.2018లో అర్.పి.ఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసి దాదాపు అన్ని అర్హతలు సాధించింది.

కానీ మెడికల్ చెకప్‌లో దృష్టి లోపం కారణంగా తిరస్కరణకు గురైంది. అయితే అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధువులకు తాను ఎస్ఐ అవుతున్నట్లు చెప్పుకుంది.

తన పరువు పోతుందని భావించిన మాళవిక ఎస్ఐ యూనిఫాం కుట్టించుకోవడంతో పాటు, నకిలీ ఐడీ కార్డ్ చేయించుకుని ఎస్‌ఐగా చెలామణి అవుతున్నది. ఈ క్రమంలో పెళ్లి సంబంధం చూసేందుకు సదరు యువతి యూనిఫాంలోనే వెళ్లింది.

అయితే అబ్బాయి తరఫున బంధువులు పై అధికారులను సంప్రదించగా యువతి మోసం బయటపడింది. పోలీసులుకు సమాచారం ఇవ్వండంతో అర్.పి.ఎఫ్ పోలీసులు మాళవికను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated On 19 March 2024 9:03 PM IST
cknews1122

cknews1122

Next Story