హోలీ పండుగకు ముందే మొదలయ్యే జాజిరి కొత్త సందడి….
రింగుడు బిల్లా ….రూపాయి దండా హోలీ పండుగకు ముందే మొదలయ్యే జాజిరి కొత్త సందడి…. సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 20 రింగుడు బిల్లా రూపాయి దండ.. దండ కాదురా దామర మొగ్గ… గుండు పోయి గండిమీద మోతలు పెట్టే..కోతి పుట్టుడు ఎందుకు.. కొమ్మలెక్కెందుకు అంటూ వెన్నెల వెలుగుల్లో జాజిరి జాటలు మొదలయ్యాయి. హోలీ పండుగకు ముందే మొదలయ్యే జాజిరి కొత్త సందడిని తీసుకువస్తుంది.తొమ్మిది రోజులపాటు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా.. కుల మతాలకతీతంగా …
![హోలీ పండుగకు ముందే మొదలయ్యే జాజిరి కొత్త సందడి…. హోలీ పండుగకు ముందే మొదలయ్యే జాజిరి కొత్త సందడి….](https://cknewstv.in/wp-content/uploads/2024/03/IMG-20240320-WA0041.jpg)
రింగుడు బిల్లా ….రూపాయి దండా
హోలీ పండుగకు ముందే మొదలయ్యే జాజిరి కొత్త సందడి….
సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 20
రింగుడు బిల్లా రూపాయి దండ.. దండ కాదురా దామర మొగ్గ… గుండు పోయి గండిమీద మోతలు పెట్టే..కోతి పుట్టుడు ఎందుకు.. కొమ్మలెక్కెందుకు అంటూ వెన్నెల వెలుగుల్లో జాజిరి జాటలు మొదలయ్యాయి.
హోలీ పండుగకు ముందే మొదలయ్యే జాజిరి కొత్త సందడిని తీసుకువస్తుంది.తొమ్మిది రోజులపాటు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా.. కుల మతాలకతీతంగా ఆడుకునే కాముడీ పాటలతో ప్రతి వీధి సందడి నెలకొంటుంది.
మగ పిల్లలు కోలాలతో.. ఆడపిల్లలు చప్పట్లతో ప్రశాంతమైన పాటలు పాడుతూ..ఇంటింటికి తిరుగుతూ సందడి చేస్తారు. తొమ్మిది రోజులపాటు సేకరించిన వార్డులు వడ్లు, మక్కలు, బియ్యం వంటివి ఆఖరి రోజున షావుకారి దగ్గర అమ్మడం.. వచ్చిన డబ్బులతో తెల్లవారి హోలీ పండుగ జరుపుకోవడం మజానిస్తుంది
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)