మిషన్ భగీరథ కార్యాలయానికి తాళం మిషన్ భగీరథ కార్యాలయానికి తాళం పడింది. ఆర్‌డబ్ల్యూఎస్ తాండూర్ సబ్‌డివిజన్‌లో పనిచేస్తున్న ఓవ్యక్తికి గత కొంత కాలంగా వేతనాలు ఇవ్వలేదు.దీంతో సంబంధిత వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. మిషన్ భగీరథ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో వికారాబాద్ జిల్లా కోర్టు కార్యాలయాన్ని సీజ్ చేయాలని ఆదేశింది. కోర్టు ఆదేశాల మేరకు సిబ్బంది మిషన్ భగీరథ కార్యాలయానికి వెళ్లి కార్యాలయానికి తాళం వేశారు. కంప్యూటర్లు, రికార్డులను ఓ గదిలో …

మిషన్ భగీరథ కార్యాలయానికి తాళం

మిషన్ భగీరథ కార్యాలయానికి తాళం పడింది. ఆర్‌డబ్ల్యూఎస్ తాండూర్ సబ్‌డివిజన్‌లో పనిచేస్తున్న ఓవ్యక్తికి గత కొంత కాలంగా వేతనాలు ఇవ్వలేదు.
దీంతో సంబంధిత వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.

మిషన్ భగీరథ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో వికారాబాద్ జిల్లా కోర్టు కార్యాలయాన్ని సీజ్ చేయాలని ఆదేశింది.

కోర్టు ఆదేశాల మేరకు సిబ్బంది మిషన్ భగీరథ కార్యాలయానికి వెళ్లి కార్యాలయానికి తాళం వేశారు. కంప్యూటర్లు, రికార్డులను ఓ గదిలో వేసి తాళం వేశారు. కాగా అధికారులు కానీ, సిబ్బంది గాని కనిపించలేదు. కార్యాలయంలో ఫర్నిచర్ కంప్యూటర్లు ఉన్న గదిని పూర్తిగా తాళం వేసి ఉంది.

Updated On 21 March 2024 5:44 PM IST
cknews1122

cknews1122

Next Story