బిర్యానిలో ప్రత్యక్షమైన ఉంగరం…
వరంగల్ జిల్లా నెక్కొండ ఉదంతం మరిచిపోక ముందే పెద్దపల్లి జిల్లా బిర్యానీలో ఉంగరంలో ప్రత్యక్షమైంది. దాంతో సదరు కస్టమర్ అవాక్కు అయ్యాడు. మాములుగా బిర్యానీ హోటల్లో అంటే లొట్టలేసుకుంటు తినేస్తారు.
కానీ., మంథనిలో ఓ హోటల్లో బిర్యానీని కళ్ళు అప్పగించి చూస్తూ తినాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో కృష్ణ బార్ అండ్ రెస్టారెంట్ లో తయారు చేసిన బిర్యానీలో ఓ ఉంగరం దర్శనమిచ్చింది.
మద్యం మత్తులో ఉన్నవారు ఏమి కనిపించదని.. భావించారో., ఏమో తెలియదు కానీ.. చేతి వెలికి ఉండాల్సిన ఉంగరం కాస్త బిర్యానీలో కనిపించడంతో దానిని తింటుంటున్న కస్టమర్ రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీశారు.
ఈ సంఘటనతో రెస్టారెంట్ నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకుండా., నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్కడ కాస్త ఆందోళన జరిగింది. వంట మాస్టర్ లేదా మరొకరి పనివారి నిర్లక్ష్యం వల్లే ఇలా బిర్యానీ లో ఉంగరం వచ్చిందని., సరైన పరిశుభ్రత నియమాలను పాటించకపోవడంతోనే ఇలాంటి పొరపాట్ల వల్ల ఇలాంటివి ఎక్కువైతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.
ఈ ఘటన పై మున్సిపల్ అధికారులు, ఫుడ్ సెప్టీ వారు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మంథని మున్సిపల్ అధికారులు బిర్యానీ లో ఉంగరంపై ఆరా తీసి రెస్టారెంట్ పై తగు చర్యలు తీసుకునే పనిలో అధికారులు ఉన్నారు.