నాయకునిగా కాకుండా సంఘా కాపరిగా మీ వెంటే ఉంటా అందరినీ కలుపుకుపోతూ నిస్వార్ధంగా పనిచేస్తా మత్స్య సహకార సంఘ అధ్యక్షులు తవిడబోయిన నాగేశ్వరరావు సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 20 మఠంపల్లి మండల కేంద్రంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ఆఫీస్ బేరర్ ల ఎన్నిక సహకార సంఘ భవన్లో ఉదయం 9 గంటలకు జిల్లా సహకార అధికారి వి అశోక్ కుమార్ అసిస్టెంట్ రిజిస్టర్ వారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం …

నాయకునిగా కాకుండా సంఘా కాపరిగా మీ వెంటే ఉంటా

అందరినీ కలుపుకుపోతూ నిస్వార్ధంగా పనిచేస్తా

మత్స్య సహకార సంఘ అధ్యక్షులు తవిడబోయిన నాగేశ్వరరావు

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 20

మఠంపల్లి మండల కేంద్రంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ఆఫీస్ బేరర్ ల ఎన్నిక సహకార సంఘ భవన్లో ఉదయం 9 గంటలకు జిల్లా సహకార అధికారి వి అశోక్ కుమార్ అసిస్టెంట్ రిజిస్టర్ వారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశంలో సభ్యులు కర్నే సైదమ్మ, బుద్ధి సక్కుబాయమ్మ,తవిడ బోయిన నాగేశ్వరరావు, చింతల లక్ష్మీనారాయణ చింతల వీరబాబు, చాగంటి నరసింహారావు, తుంగం వీరయ్య, తగడబోయిన వీరయ్య, తవిడ బోయిన కృష్ణ లు హాజరు కాగా 1,అధ్యక్ష పదవికి తవిడబోయిన నాగేశ్వరరావు నామినేషన్ వేయగా చింతల లక్ష్మీనారాయణ అట్టి పేరును ప్రతిపాదించగా చాగంటి నరసింహారావు బలపరిచారు.

2, ఉపాధ్యక్షులు పదవి కొరకు తుంగం వీరయ్య నామినేషన్ వేయగా తవిడ బోయిన కృష్ణ ప్రతిపాదించగా చింతల వీరబాబు బలపరిచారు.3, కార్యదర్శి పదవికి చింతల వీరబాబు నామినేషన్ వేయగా తవిడ బోయిన వీరయ్య ప్రతిపాదించగా శ్రీమతి బుద్ధి సక్కు బాయమ్మ బలపరిచారు.

వీరు ముగ్గురి పదవులకు ఒక్కొక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా సభ్యుల అభిప్రాయం మేరకు సహాయ కార్యదర్శిగా చింతల లక్ష్మీనారాయణ కోశాధికారిగా తగడబోయిన కృష్ణ, డైరెక్టర్లుగా శ్రీమతి కర్నే సైదమ్మ, బుద్ధి సక్కుబాయమ్మ, చాగంటి నరసింహారావు, తగడబోయిన వీరయ్య లు ఎన్నిక కాబడ్డారు.

వెంటనే ఎన్నికల అధికారి అశోక్ ఆధ్వర్యంలో సహకార భవన్లో వారిచేత ప్రమాణస్వీకారం చేయించి వారికి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ముదిరాజ్ సంఘ పెద్దలు మాజీ అధ్యక్షులు కంటు లక్ష్మయ్య పాలకవర్గ సభ్యులను వేదిక మీదికి ఆహ్వానించి వారి యొక్క స్థానాల్లో కూర్చోబెట్టి కుల సంఘం మరియు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఇట్టి కార్యక్రమంలో కంటు లక్ష్మయ్య చింతల గురవయ్య కర్నే వెంకటేశ్వర్లు పులుసు శ్రీను చింతల సత్యం వారు మాట్లాడుతూ నూతన పాలకవర్గం ఎన్నిక మునుపెన్నడూ జరగనీ విధంగా యువత ముందుకు వచ్చి స్నేహపూర్వకంగా ఎన్నికలు జరిగినా అందరూ సమిష్టిగా ఏకాభిప్రాయంతో సోదరుభావంగా మనస్పార్ధాలు లేకుండా మరల ఒక్కటి అయ్యి పెద్దల సూచనల మేరకు పాలకవర్గంగా ఏర్పడడం శుభప్రదమని పాలకవర్గం వారు అందరినీ కలుపుకు పోతూ సంఘం అభివృద్ధిని ముందంజలో నడిపిస్తూ నిబద్దతగా నిస్వార్ధంగా పనిచేస్తు సంఘానికి ముదిరాజ్ కులానికి నూతన పాలకవర్గం మంచి పేరు తీసుకురావాలని వీరి యొక్క పనిలో మా సహాయ సహకారాలు ఉంటాయని తెలుపుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

అధ్యక్షులు తవిడబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన కుల సంఘ పెద్దలు మరియు డైరెక్టర్లకు మహిళలకు యూత్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ నేను నాయకునిగా కాకుండా సంఘ కాపరిగా మీ వెంటే ఉంటానని అందరినీ కలుపుకుపోతూ నిస్వార్ధంగా పనిచేస్తానని సంఘం అభివృద్ధిలో భాగస్వామ్య మౌతు వ్యక్తిగత స్వార్థానికి వెళ్లకుండా అందరి సలహా సూచనలు అభిప్రాయాల మేరకు పని చేస్తానని అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి,నలబోతుల వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి అధ్యక్షులు తవిడబోయిన నాగేశ్వరావును సంతోషపరుస్తూ ఆయనకు పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఈ కమిటీ నేడు అనగా 20-3-2024 నుండి 19- 3- 2029 వరకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం పాలకవర్గ సభ్యులు స్వీట్లు పంచి అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Updated On 21 March 2024 11:14 PM IST
cknews1122

cknews1122

Next Story