బిఆర్ యస్ పార్టీ విడనున్న ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ ధూపాటి. భద్రరాజు….? ఆయన తో పాటే మండలం లో మరికొంతమంది నాయకులు కూడ పార్టీ మరే అవకాశం…? ఖమ్మం / తల్లాడ మార్చి 24 సీకే న్యూస్ ప్రతినిధి విజయ్ తల్లాడ పట్టణానికి చెందిన ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ ధూపాటి. భద్ర రాజు గత కొన్ని రోజులు గా బిఆర్ యస్ పార్టీ పోగ్రామ్స్ లో ఎక్కడ కనపడని పరిస్థితి అయితే బిఆర్ యస్ …

బిఆర్ యస్ పార్టీ విడనున్న ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ ధూపాటి. భద్రరాజు….?

ఆయన తో పాటే మండలం లో మరికొంతమంది నాయకులు కూడ పార్టీ మరే అవకాశం…?

ఖమ్మం / తల్లాడ మార్చి 24 సీకే న్యూస్ ప్రతినిధి విజయ్

తల్లాడ పట్టణానికి చెందిన ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ ధూపాటి. భద్ర రాజు గత కొన్ని రోజులు గా బిఆర్ యస్ పార్టీ పోగ్రామ్స్ లో ఎక్కడ కనపడని పరిస్థితి అయితే బిఆర్ యస్ పార్టీ ని విడుతున్నట్లుగా విశ్వాసనియ సమాచారం.

గత 30 సంవత్సరాలనుండి మొదట నుంచి టీడీపీ లో ఉండి 2001 సంవత్సరం లో తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ వార్డు మెంబెర్ గా గెలిచి ఉపసర్పంచ్ గా ఎన్నిక అయినారు.2009 నుంచి సత్తుపల్లి నియోజకవర్గం కి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వచ్చినప్పుడు నుంచి వారి ముఖ్య అనుచరుడుగా గత 15 సంవత్సరాలు గా ఉన్నారు.

రెండు పర్యాయలు టీడీపీ మండల అధ్యక్షులు గా ధూపాటి భద్రరాజు ఉన్నారు. గతం లో సత్తుపల్లి నియోజకవర్గం లో మూడు సార్లు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గెలుపు కోసం కృషి చేయడం జరిగింది.ఆ తరువాత టీడీపీ నుంచి బి ఆర్ యస్ పార్టీ లోకి మాజీ ఎమ్మెల్యే సండ్ర తోనే పార్టీ మారడం జరిగింది.

2018 నుంచి 2023 వరకు వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గా 3 సార్లు పదవి 5 సంవత్సరాల వరకు ఉన్నారు.ఒక బీసీ నాయకుడిగా తల్లాడ పట్టణం మరియు మండలం లోనే అందరితో పరిచయలు ఉన్న వ్యక్తి.

రాజకీయం గా ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి,ఈయన తో పాటు ఉన్న నాయకులు కార్యకర్తలు తల్లాడ మండలం లో మరి కొంతమంది ఈయనతోనే పార్టీ మారానున్నట్ల సమాచారం.మండలం లో ఏమి జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

Updated On 24 March 2024 9:46 PM IST
cknews1122

cknews1122

Next Story