EMI వేధింపులతో ఆత్మహత్యాయత్నం షాద్‌నగర్‌రూరల్‌: తీసుకున్న రుణానికి వాయిదా చెల్లించాలంటూ ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ వేధింపులతో బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా, బాలానగర్‌ మండలం, చిన్నరేవల్లి పంచాయతీ పరిధిలోని పెద్దచెల్కతండాకు చెందిన రవి ఆరు నెలల క్రితం ఓ ప్రైవేటు ఫైనాన్స్‌లో ఇల్లు తాకట్టు పెట్టి రూ.4లక్షల రుణం తీసుకున్నాడు. ఇందుకు ప్రతీ నెల 20న రూ.9,806 …

EMI వేధింపులతో ఆత్మహత్యాయత్నం

షాద్‌నగర్‌రూరల్‌: తీసుకున్న రుణానికి వాయిదా చెల్లించాలంటూ ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ వేధింపులతో బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.

ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా, బాలానగర్‌ మండలం, చిన్నరేవల్లి పంచాయతీ పరిధిలోని పెద్దచెల్కతండాకు చెందిన రవి ఆరు నెలల క్రితం ఓ ప్రైవేటు ఫైనాన్స్‌లో ఇల్లు తాకట్టు పెట్టి రూ.4లక్షల రుణం తీసుకున్నాడు. ఇందుకు ప్రతీ నెల 20న రూ.9,806 వాయిదా చెల్లిస్తున్నాడు.

ఈ నెల వాయిదా చెల్లించకపోవడంతో ఆ కంపెనీకి చెందిన వారు ఇంటికి వచ్చారు. రవి లేక పోవడంతో భార్యను వాయిదా చెల్లించాలని కోరారు. లేదంటే ఇక్కడ నుంచి వెల్లమని భీష్మించుకున్నారు. ఇంటి చుట్టుపక్కల వారికి అప్పు విషయం చెప్పారు.

దీంతో అవమానంగా భావించిన రవి భార్య భర్త వచ్చాక విషయం చెప్పింది. దీంతో బాధితుడు సదరు కంపెనీకి వెళ్లి తరువాత చెల్లిస్తానని చెప్పినా ఇంటికి వచ్చి పరువు తీస్తారా అని ఫైనాన్స్‌ వారిని ప్రశ్నించాడు. దీంతో వాగ్వాదం జరిగి కంపెనీ వారు రవిని కార్యాలయం నుంచి కిందికి తోసుకుంటూ వచ్చారు.

దీంతో మనస్తాపానికి గురైన రవి ఆత్మహత్య చేసుకుంటానని కార్యాలయం వద్ద పెట్రోల్‌ బాటిల్‌తో ఆందోళనకు దిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రవిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు సదరు ఫైనాన్స్‌ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Updated On 24 March 2024 2:45 PM IST
cknews1122

cknews1122

Next Story