30న పార్లమెంట్ స్థాయి సన్నాక సమావేశాన్ని జయప్రదం చేయండి
సమావేశ స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది
రానున్న ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ మధ్యనే పోటీ
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగం వృధా కాదు
లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 25
మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సన్నాకా సమావేశ ఏర్పాటుకై తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల మరియు పౌరాసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం మట్టపల్లి గ్రామానికి విచ్చేయగ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ప్రాంగణంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రి ఉత్తమ్ కు స్వాగతం పలికారు.
అటు తర్వాత లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొనుటకు దేవాలయమునకు వెళ్లగా ఆలయ అర్చకులు అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లి రావు విజయకుమార్ , ఆలయ సీఈఓ సిరికొండ నవీన్ స్వాగతం పలికి దేవాలయంలోకి ఆహ్వానించారు.
మంత్రి ఉత్తమ్ దైవ దర్శనం చేసుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం సన్నాహక సమావేశ స్థలాన్ని పార్టీ నాయకులతో పరిశీలించారు తరువాత ఆర్యవైశ్య సత్రంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఉదయం 10 నుండి 11 గంటల వరకు ముఖ్యులు దేవాలయ దైవదర్శనం ఉంటుందని 11 గంటల నుండి ఒంటిగంట వరకు ముఖ్య నాయకులకు కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలు దేశ చరిత్రలో స్వేచ్ఛగా ప్రజాస్వామ్య దేశంగా మిగలాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించి బిజెపిని ఓడించాలని క్రమక్రమంగా చూస్తున్న విషయం ఏమిటంటే మోదీ నిరంకుశ విధానం ఈ దేశంలో కొనసాగుతుందని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని ఖూనీ చేసే విధంగా పాలన నడుస్తుందని ప్రతిపక్షాలతో చర్చలు లేకుండా స్వతంత్ర భారతదేశంలో మొట్ట మొదటిసారి చివరి సమావేశంలో 146 మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంటు సాక్షిగా గెంటి వేసిన ఘనత బిజెపి ప్రభుత్వ నరేంద్ర మోడీకే దక్కిందని పార్లమెంటు వ్యవస్థలో మీడియా బిజెపి చెప్పు చేతుల్లో నడుస్తుందని గతంలో భారత దేశంలో మీడియాకు స్వేచ్ఛ ఉండేదని ఇప్పుడు అది లేదని వారిని తొక్కి పట్టి వారి కబంధహస్తాలతో వారిని మూసేస్తున్నారని ఎవరైనా ప్రభుత్వం మీద రాస్తే కేసులు వేసి దేశద్రోహం కింద జైల్లో వేస్తున్నారని పార్లమెంటు నరేంద్ర మోడీ చెప్పిన అబద్ధాలు 2016 నుండి 2020 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు
నేటి వరకు ఆ ఊసే లేదని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న పెద్దమనిషి వారి ఆదాయం పెంచకపోగా సగానికి పడిపోయిందని రైతుకు కనీసం మద్దతు ధర చట్టబద్ధత చేయడానికి ఆందోళన చేస్తున్న రైతులపై అణిచివేత చర్యలకు పాల్పడ్డారని ఆ ధర్నాలో ఎందరో కాల్పుల్లో చనిపోయారని నరేంద్ర మోడీ మొన్నటికి దేశం మొత్తం ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తానన్నారు
కానీ మొత్తం రాష్ట్రంలో కెసిఆర్ మోడీ ఇద్దరు దగా చేసారని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఆ మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు ఆగమాగం చేశారని పారిశ్రామిక రంగం దెబ్బతిన్నది వ్యవసాయ రంగం దెబ్బతిన్నది ఉద్యోగాలు రాలే రైతుల ఆదాయం పెరగలే అన్ని విధాలుగా బిజెపి ప్రభుత్వం తెలంగాణను మోసం చేసింది తెలంగాణ ఏర్పడిన చట్టం పార్లమెంటులో చట్టం కింద ఉన్న బిల్లు కాజీపేటలో రైల్వే ఫ్యాక్టరీ గాని బయ్యారంలో స్టీల్ ప్లాంట్ గాని ఏ ఒక్క హామీ కూడా బిజెపి ప్రభుత్వం నెరవేర్చలేదు
తెలంగాణలో వారికి ఓటు అడిగి హక్కు లేదు వారి సమాజాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే విధంగా చేస్తున్నారు పార్లమెంటు ఎన్నికల్లో భారత దేశంలో ఇండియా కూటమి ఎన్నికల్లో గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు.
నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న బిజెపి చిత్తుచిత్తుగా ఓడిపోతుందని ఇక బిఆర్ఎస్ కు ఓటు వేసి తమ ఓటును ప్రజలు వృధా చేసుకోవద్దని బిఆర్ఎస్ రాష్ట్రంలో ఇక మిగలదని దేశంలోనైనా రాష్ట్రంలోనైనా బిజెపి కాంగ్రెస్ కు మధ్య పోటీ ఉంటుందని రాష్ట్రంలో 12 నుండి 13 పార్లమెంటు స్థానాలు రాబోతున్నాయని భారత దేశంలోనే అతిపెద్ద సభ్యత్వ కార్యక్రమం నల్లగొండ పార్లమెంటు పరిధిలో జరిగిందని భారతదేశంలోనే అతి ఎక్కువ మెజార్టీ వచ్చే దిశగా నల్లగొండ నుండి ప్రయత్నం చేస్తున్నామని మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాలలో మెజార్టీ మూడు లక్షల దాటిందని తెలంగాణ మొత్తం అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎక్కువ మెజార్టీ నల్లగొండ పార్లమెంటు స్థానంలో మూడు లక్షల వరకు మెజార్టీ దాటిందని తెలంగాణ మొత్తంలో నల్లగొండ పార్లమెంటు పరిధిలో సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో శ్రమించి పార్టీ పటిష్టతకు కట్టుబడి ఎన్నో అవమానాలు కేసులు పెట్టిన వారు జంకకుండా పార్టీ వైపు ఉండి గెలిపించారని వారి శ్రమ వృధా కాదని అలాగే రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా చత్తా చాటుతామని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.