నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త... వైద్యశాఖలో కొలువుల జాతర.. వైద్యారోగ్యశాఖలో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టుల భర్తీ కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ఇన్‌ఛార్జ్‌ డీఎంఈగా వాణీదేవి నియామకంపై స్పందించిన హైకోర్టు పూర్తిస్థాయి డీఎంఈని నియమించాలని ఆదేశించింది. దీంతో త్వరలోనే డీఎంఈ సహా డీపీఏ, డీసీహెచ్‌, కమిషనర్‌, టీవీవీపీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి వైద్యారోగ్యశాఖలో పలు కీలక పోస్టులను భర్తీ చేయకుండా ఇన్‌ఛార్జ్‌లతోనే ప్రభుత్వం …

నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త...

వైద్యశాఖలో కొలువుల జాతర..

వైద్యారోగ్యశాఖలో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టుల భర్తీ కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ఇన్‌ఛార్జ్‌ డీఎంఈగా వాణీదేవి నియామకంపై స్పందించిన హైకోర్టు పూర్తిస్థాయి డీఎంఈని నియమించాలని ఆదేశించింది.

దీంతో త్వరలోనే డీఎంఈ సహా డీపీఏ, డీసీహెచ్‌, కమిషనర్‌, టీవీవీపీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి వైద్యారోగ్యశాఖలో పలు కీలక పోస్టులను భర్తీ చేయకుండా ఇన్‌ఛార్జ్‌లతోనే ప్రభుత్వం నెట్టుకువస్తోంది. డీఎంఈ కేటగిరీలో డా. రమేశ్‌రెడ్డిని అప్పటి ప్రభుత్వం నియమించగా పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌లపై విచారణ జరిపిన కోర్టు ఇచ్చిన ఆదేశాలతో 2023లో పూర్తి స్థాయి డీఎంఈ పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, ఆ స్థానాన్ని ఇప్పటి వరకు భర్తీ చేయలేదు.

ఈ పోస్టు భర్తీ కోసం రేవంత్ సర్కార్‌ ఫిబ్రవరి 6న డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీని (డీపీసీ) ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సీనియర్‌ జాబితాను తయారు చేసినప్పటికీ.. ఎన్నికల కోడ్‌ కారణంగా నియామకాన్ని చేపట్టలేదు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వైద్యారోగ్యశాఖలో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Updated On 26 March 2024 12:32 PM IST
cknews1122

cknews1122

Next Story