ఎమ్మెల్యే అనుమతి లేకుండా మంత్రులెవరు పార్టీలో చేర్చుకోరు
తల్లాడలో కార్యకర్తల సమావేశంలో డాక్టర్ మట్టా దయానంద్
ఖమ్మం / తల్లాడ మార్చి 27 సీకే న్యూస్ ప్రతినిధి విజయ్
సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మేము గెలిచాము కదా అని ఊరుకోమని, ఇకనుంచి జరిగే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడమే మా ప్రధమ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా తల్లాడలోని ఆర్బి గార్డెన్లో మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షులు కాపా సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా దయానంద్ హాజరై మాట్లాడుతూ కొందరు రాష్ట్ర మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దగ్గరకు వెళ్లి పార్టీలో చేరుతామని పుకార్లు పుట్టిస్తున్నారని, స్థానికంగా సత్తుపల్లి ఎమ్మెల్యే అనుమతి లేకుండా మంత్రులు ఎవరు పార్టీలో చేర్చుకోరన్నారు.
ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా మంత్రులు ఎవరు నిర్ణయం తీసుకోరన్నారు. ఎవరైనా పార్టీలోకి తీసుకోవాలనుకుంటే ఆ మండల, గ్రామ నాయకులు సఖ్యతగా ఉండి మాకు సమాచారం ఇస్తే పార్టీలో తీసుకోవడం జరుగుతుందన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడ్డారని, వారి కోసం పనిచేస్తామని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన వంద రోజుల్లోనే సత్తుపల్లి నియోజకవర్గానికి 100 కోట్లు తీసుకొచ్చామని తెలిపారు.
నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పథకాలు సంపూర్ణంగా పూర్తి చేసి రాష్ట్రంలోనే సత్తుపల్లి నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఏ ఎన్నికల జరిగినా ఈసారి కాంగ్రెస్ పార్టీ దే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సూచించి తల్లాడ మండల సత్తా చూపించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దగ్గుల రఘుపతి రెడ్డి, నీలాద్రి ఆలయ డైరెక్టర్లు దగ్గుల నాగిరెడ్డి, బొడ్డు రామ్ లక్ష్మణ్, వెమిరెడ్డి కృష్ణారెడ్డి, దుండేటి వీరారెడ్డి, గణేషుల రవి,మాజీ ఎంపీటీసీ జోసఫ్ దిరిశాల నరసింహారావు, రాయల రాము, మండలంలోని అన్ని గ్రామాల నాయకులు పాల్గొన్నారు.