ఫోన్ ట్యాపింగ్ కేసులో… వెంట్రుక కూడా పీకలేరు… కేటీఆర్ హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీఎం రేవంత్​రెడ్డి తన వెంట్రుక కూడా పీకలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారం రేవంత్ చేతిలో ఉందని, ఆయనకు తోచినట్లు చేసుకోవచ్చని చెప్పారు. ఆయనకు భయపడెటోళ్లు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. ఫోన్ ట్యాంపింగ్​లు, స్కామ్​లు అంటూ వార్తలు రాయించుకొని ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ …

ఫోన్ ట్యాపింగ్ కేసులో… వెంట్రుక కూడా పీకలేరు… కేటీఆర్

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీఎం రేవంత్​రెడ్డి తన వెంట్రుక కూడా పీకలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారం రేవంత్ చేతిలో ఉందని, ఆయనకు తోచినట్లు చేసుకోవచ్చని చెప్పారు. ఆయనకు భయపడెటోళ్లు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు.

ఫోన్ ట్యాంపింగ్​లు, స్కామ్​లు అంటూ వార్తలు రాయించుకొని ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో నాయ కులు, కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు.

రేవంత్ రెడ్డికి సీఎంగా పనిచేసే తెలివి లేదన్నారు. ఈ మధ్య ఒక మీటింగ్​లో రేవంత్ మాట్లాడుతూ పేగులు మెడలో వేసుకుంటా అని అన్నారని, బోటీ కొట్టే వాళ్లలా అట్లా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. చేతనైతే ప్రజలకు కరెంటు, రైతుబంధు, మహిళలు, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఇసుక దందా చేస్తూ.. రైస్ మిల్లర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, రియల్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారని.. అలాంటి వార్తలన్ని బయటకు రాకుండా స్కామ్‌ల పేరు చెప్తున్నారని ఆరోపించారు.

బీజేపీలో చేరే మెదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే

లోక్​సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మెదటి వ్యక్తి రేవంత్​ రెడ్డి అని కేటీఆర్ అన్నారు. స్టేట్​లో బీజేపీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా అన్న అను మానం కలుగుతోందన్నారు.

"ఢిల్లీలో మోదీని రాహుల్ గాంధీ చౌకిదార్ చోర్ అంటే, రేవంత్ మాత్రం బడే భాయ్ అంటున్నరు. అక్కడ అదానీ మంచోడు కాదని అంటే.. రేవంత్ రెడ్డి మాత్రం మంచోడు అని అంటున్నరు.

అక్కడ రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ దుర్మార్గం అంటే.. ఇక్కడ బడేభాయ్( మోదీ) మోడల్ బాగుందని రేవంత్ అంటున్నరు. తెలంగాణలో రేవంత్ రెడ్డి బీజేపీ పాట పాడుతున్నారని, అందుకే ఎంపీ ఎన్నికల తర్వా త ఆయన బీజేపీలో చేరొచ్చు.

ఎన్నిసార్లు బీజేపీలోకి వెళ్తారని తాము అన్నా.. ఆయన ఖండించడంలేదు. ఎం దుకంటే ఎన్నికల ఆయన తర్వాత తన మనుషులతో బీజేపీలోకి వెళ్తారు కనుకే స్పందించట్లేదు' అని అన్నారు.

బిల్డింగ్‌లకు ఎందుకు పర్మిషన్లు ఇవ్వడం లేదు

మున్సిపల్ శాఖ తనవద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి 3 నెలలుగా ఎందుకు బిల్డింగ్‌లకు పర్మిషన్లు ఇవ్వడం లేదో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. డబ్బులు ఇస్తేనే బిల్డింగ్‌లకు అనుమతులు ఇస్తున్న మాట నిజం కాదా?

ఢిల్లీకి రూ.2,500 కోట్లు పంపింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సీఎం లెక్క మాట్లాడటం లేదని కేటీఆర్ విమర్శించారు. ఆయన జేబులో కత్తెర పెట్టుకొని జేబుదొంగ లెక్క తిరుగుతున్నాడన్నారు.

ఇలాంటి వ్యక్తి తెలంగాణకు సీఎంగా ఉన్నారని దుయ్యబట్టారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌పై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. గ్రేటర్ రాజకీయాల్లో సికింద్రాబాద్ అంటేనే గుర్తుకొచ్చే పేరు పద్మారావు గౌడ్ అని అన్నారు. 24 ఏండ్ల నుంచి పార్టీకి హైదరాబాద్​లో అండగా ఉన్నారన్నారు. పద్మారావు గౌడ్‌ను అభ్యర్థిగా ప్రకటించగానే సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ గెలుస్తుందని అందరూ అంటున్నారన్నారు.

దానం నాగేందర్‌పై కేటీఆర్‌ ఫైర్

బీఆర్ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై కేటీఆర్ మండిపడ్డారు. దానం నిర్ణయం తప్పు అని.. ఈ ఎన్నికల్లో ఆయన గెలిచి చూపించాలని సవాల్ చేశారు. అధికారం కోసం ఆశపడి, గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసి వెళ్లారన్నారు.

ఖైరతాబాద్ ప్రజలే బీఆర్ఎస్‌ను గెలిపించి, దానం నిర్ణయం తప్పని నిరూపిస్తారన్న నమ్మకం తనకు ఉన్నదన్నారు. దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. అవసరం అయితే సుప్రీంకోర్టు దాకా వెళ్లి మరి అనర్హుడిగా ప్రకటించేలా చేస్తామని చెప్పారు. మూడు నాలుగు నెలల్లోనే ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వస్తుందని, ఆ ఎన్నికల్లో ద్రోహం చేసిన వారికి బుద్ధి చెప్పాలన్నారు.

బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పోటీ కాదు

సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు బీఆర్ఎస్‌కు పోటీగా చూస్తలేరని, దానం నాగేందర్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని కేటీఆర్ వివరించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డినే బీఆర్ఎస్‌కు పోటీ అన్నారు. అయితే గతంలో అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోతే అదృష్టవశాత్తు సికింద్రాబాద్ కిషన్ రెడ్డి ఎంపీ అయ్యారన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేయలేదన్నారు.

ఆయన కేంద్రమంత్రిగా కురుకురే ప్యాకెట్లు పంచడం, సీతాఫల్మండిలో రైల్వే లిఫ్ట్ ఓపెన్ చేయడం, సింటెక్స్ ట్యాంకులను ఓపెన్ చేయడం మాత్రమే హైదరాబాద్‌కు చేసిన గొప్ప సేవ అని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన ఆధారాలు ఆయన కోర్టుకు ఇవ్వాలన్నారు.

బీఆర్ఎస్‌కు ఉద్యమాలు, పోరాటాలు కొత్తకాదని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌ పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ విధానాల పైన పోరాడుతామన్నారు. శ్రేణులను, పార్టీని కాపాడుకుంటూ ముందుకు పోతామన్నారు.

కార్యకర్తలకు ఏ కష్టం కలిగినా నగరంలోని ప్రతి ఒక్క నాయకుడు అందుబాటులో ఉంటాడన్నారు. పదేండ్ల పాలనలో హైదరాబాదు నగరాన్ని బీఆర్​ఎస్ తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేసిందన్నారు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసింది ఏం లేదన్నారు. ఒక్క రూపాయి కూడా హైదరాబాద్ నగరానికి ఆయన అదనంగా తీసుకురాలేదన్నారు.

జరుగురా బై.. నువ్వెవడివిరా.. గోపీనాథ్, శ్రీధర్ రెడ్డిల తిట్ల పురాణం

తెలంగాణ భవన్​లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి బూతులు తిట్టుకున్నారు. ఇది చూసి స్టేజీ మీదున్న మాజీ మంత్రి తలసాని, మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్​ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ షాక్​ తిన్నారు. కేటీఆర్ భవన్​కు రావడానికి కొద్ది నిముషాల ముందు ఈ సంఘటన జరిగింది.

వేదికపై తలసాని మాట్లాడిన అనంతరం మాగంటి మాట్లాడేందుకు మైక్​ తీసుకున్న టైంలో గొడవ జరిగింది. తలసాని నుంచి మైక్​ తీసు కున్న మాగంటి "పిచ్చినాకొడుకు. జరుగురా బై జరుగు. నిన్ను ఎవరు పిలిచిన్రు'అంటూ సీరియస్ అయ్యారు.

దీనికి ప్రతిగా రావుల స్పందిస్తూ "నువ్వెవడివిరా అనడానికి. ఏం మాట్లాడుతున్నవ్. ఇదేం పద్ధతి' అంటూ రియాక్ట్ అయ్యారు. తలసాని కల్పించుకొని ఇద్దరికి సర్ది చెప్పారు.

Updated On 27 March 2024 1:42 PM IST
cknews1122

cknews1122

Next Story