కొబ్బరి చెట్టుపై నుండి పడి యువకుడు మృతి! సి కె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్. కొబ్బరి చెట్టుకు ఉన్న కొబ్బరి కాయలు కోయడానికి చెట్టుపైకి ఎక్కిన ఓ యువకుడు కాలు జారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుదవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్లి చూస్తే మండల పరిధిలోని అమ్మపాలెం గ్రామంలో నివాసం వుంటున్న పుచ్చా సత్యనారాయణ అనే వ్యక్తి ఇంటి వద్ద పెరటిలో ఉన్న కొబ్బరిచెట్టుకు ఉన్న కొబ్బరి కాయలు కోయడానికి …

కొబ్బరి చెట్టుపై నుండి పడి యువకుడు మృతి!

సి కె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.

కొబ్బరి చెట్టుకు ఉన్న కొబ్బరి కాయలు కోయడానికి చెట్టుపైకి ఎక్కిన ఓ యువకుడు కాలు జారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుదవారం చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళ్లి చూస్తే మండల పరిధిలోని అమ్మపాలెం గ్రామంలో నివాసం వుంటున్న పుచ్చా సత్యనారాయణ అనే వ్యక్తి ఇంటి వద్ద పెరటిలో ఉన్న కొబ్బరిచెట్టుకు ఉన్న కొబ్బరి కాయలు కోయడానికి అదే గ్రామానికి చెందిన రేగుల నాగరాజు(23) అనే యువకుడు ఎక్కి కాలు జారి కింద పడి మృతి చెందినట్లు తెలుస్తోంది.గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నాయకపోడు సంఘం నేతలు నాగరాజు మృతికి సంతాపం తెలిపారు.నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం ఆపంద్భందు పథకం కింద 10 లక్షల రూపాయల ఎక్ష గ్రేషియా చెల్లించాలని కోరారు.

Updated On 28 March 2024 9:49 PM IST
cknews1122

cknews1122

Next Story