మద్యం తాగి పాఠశాలకు వచ్చిన హెడ్ మాస్టర్ నిర్బంధించిన గ్రామస్థులు.. సస్పెండ్‌ చేసిన డీఈవో తాజాగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మందు కొట్టి పాఠశాలకు హాజరయ్యాడు.ఒళ్ళు మరిచి పిల్లలపై ప్రతాపం చూపాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సదరు ఉపాధ్యాయుడికి తగిన బుద్ధి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్ల మండలం జీపీ పల్లి గ్రామంలో బుధవారం జరిగింది ఈ ఘటన. చర్ల మండలం జిపి పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంచార్జ్ హెడ్ మాస్టర్ బానోత్ కృష్ణ విధులు …

మద్యం తాగి పాఠశాలకు వచ్చిన హెడ్ మాస్టర్

నిర్బంధించిన గ్రామస్థులు.. సస్పెండ్‌ చేసిన డీఈవో

తాజాగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మందు కొట్టి పాఠశాలకు హాజరయ్యాడు.
ఒళ్ళు మరిచి పిల్లలపై ప్రతాపం చూపాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సదరు ఉపాధ్యాయుడికి తగిన బుద్ధి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్ల మండలం జీపీ పల్లి గ్రామంలో బుధవారం జరిగింది ఈ ఘటన.

చర్ల మండలం జిపి పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంచార్జ్ హెడ్ మాస్టర్ బానోత్ కృష్ణ విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం మార్చి 27న మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. మద్యం మత్తులో విధులకు హాజరైన కృష్ణ విద్యార్థులను విచక్షణా రహితంగా కొట్టాడు.

విద్యార్థులు భయపడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సదరు ప్రధానోపాధ్యాయుడిని పాఠశాల లోపలికి లాక్కెళ్లి ఒక గదిలో నిర్బంధించి తాళం వేశారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

ప్రతిరోజు పాఠశాలకు తాగి వచ్చి అక్కడ ఉన్న చెట్ల కొమ్మలను విరిచి తమను కొడుతున్నాడని విద్యార్థులు వాపోయారు. ఈ తాగుబోతు టీచర్ ఉంటే తమ పిల్లలను పాఠశాలకు పంపకూడదని తల్లిదండ్రులు ఖరాఖండిగా చెబుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి విచారణ చేపట్టారు. స్కూల్ కాంప్లెక్స్ నుండి అధికారులు వస్తున్నారని తెలిసి, సమాధానం చెప్పకుండా మద్యం మత్తులో ఉన్న టీచర్ కృష్ణ అక్కడి నుండి జారుకున్నాడు.

విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై నివేదిక అందించారు. దీనితో సదరు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

Updated On 28 March 2024 1:43 PM IST
cknews1122

cknews1122

Next Story