ఖమ్మంలో మరో మూడు హాస్పిటల్ సీజ్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో డీఎంహెచ్ఐ తనిఖీ నిబంధనలు పాటించని మూడు దవాఖానాల సీజ్ సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం వైద్య విభాగం: నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొరడా ఝులిపించారు. డీఎంహెచై డాక్టర్ బి.మాలతి ఆధ్వర్యాన బుధవారం జిల్లా కేంద్రంలోని పలు ఆస్పత్రుల్లో తనిఖీ చేశారు. వైరా రోడ్డులోని ఆదిత్య ఆస్పత్రిలో అబార్షన్లు నిర్వహిస్తున్నట్లు అందిన ఫిర్యాదుతో రెండు రోజుల క్రితం టాస్క్ …

ఖమ్మంలో మరో మూడు హాస్పిటల్ సీజ్

ప్రైవేట్ ఆస్పత్రుల్లో డీఎంహెచ్ఐ తనిఖీ

నిబంధనలు పాటించని మూడు దవాఖానాల సీజ్

సికె న్యూస్ ప్రతినిధి

ఖమ్మం వైద్య విభాగం: నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొరడా ఝులిపించారు. డీఎంహెచై డాక్టర్ బి.మాలతి ఆధ్వర్యాన బుధవారం జిల్లా కేంద్రంలోని పలు ఆస్పత్రుల్లో తనిఖీ చేశారు.

వైరా రోడ్డులోని ఆదిత్య ఆస్పత్రిలో అబార్షన్లు నిర్వహిస్తున్నట్లు అందిన ఫిర్యాదుతో రెండు రోజుల క్రితం టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేశారు. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి అబార్షన్లు నిర్వహిస్తుండగా గుర్తించి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

దీంతో ఈ ఆస్పత్రిని డీఎంహెచ్ సీజ్ చేశారు. అదే కాంప్లెక్స్లోని తులసి డెంటల్ ఆస్పత్రి, పాజిటివ్ హోమియో కేర్ ఆస్పత్రులను సైతం సీజ్ చేశారు.

ఎలాంటి అనుమతి లేకుండా నిబంధనలు తుంగలో తొక్కి నిర్వహిస్తున్నట్లు తేల డంతో ఈ ఆస్పత్రులను సీజ్ చేసినట్లు డీఎంహెచ్ తెలిపారు. తనిఖీల్లో డిప్యూటీ డీఎంహెచ్ ఓ డాక్టర్ సైదులు, డెమో కాశీనాథ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Updated On 28 March 2024 9:53 AM IST
cknews1122

cknews1122

Next Story