తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టొద్దు : జిల్లా కలెక్టర్ ప్రియాంక అల.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
మార్చ్ 29,
ధాన్యం తూకంలో తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీల పై చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అల హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్ల పై పలు శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు.
ఈ యాసంగి నుంచి ఐరీస్ ద్వారా ధాన్యం సేకరణ పద్ధతిని అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 128 ధాన్యం కొనుగోళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ. 2,203, బీ గ్రేడ్ రకానికి రూ. 2,183 మద్దతు ధర చెల్లించనున్నట్టు తెలిపారు.
కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం ధాన్యం మద్దతు ధరలు, నాణ్యతా ప్రమాణాలతో రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రోగ్రాంలో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్డీవో విద్యాచందన, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ త్రినాథ్, పౌరసరఫరాల అధికారి రుక్మిణి, డీసీవో కుర్షీద్, డీఏవో బాబూరావు తదితరులు పాల్గొన్నారు.