పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను అప్పగించిన హోంగార్డు శ్రీశైలం…
పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను అప్పగించిన హోంగార్డు శ్రీశైలం……… నిజాయితీ చాటుకోవడం పట్ల అధికారుల భక్తుల, అభినందనలు… సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 29 యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చేసిన సిద్దిపేటకు చెందిన శ్రీనివాస్ లక్ష్మి దంపతులకు చెందిన బంగారు ఆభరణాల బాక్స్ ను శుక్రవారం పోగొట్టుకోగా విధుల్లో ఉన్న హోంగార్డు శ్రీశైలం కు దొరకడంతో వారికి అప్పగించి నిజాయితీని చాటుకున్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి …

పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను అప్పగించిన హోంగార్డు శ్రీశైలం………
నిజాయితీ చాటుకోవడం పట్ల అధికారుల భక్తుల, అభినందనలు…
సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 29
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చేసిన సిద్దిపేటకు చెందిన శ్రీనివాస్ లక్ష్మి దంపతులకు చెందిన బంగారు ఆభరణాల బాక్స్ ను శుక్రవారం పోగొట్టుకోగా విధుల్లో ఉన్న హోంగార్డు శ్రీశైలం కు దొరకడంతో వారికి అప్పగించి నిజాయితీని చాటుకున్నారు.
శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం అనంతరం పాత గుట్ట శ్రీ స్వామి వారి దర్శనం కోసం వెళ్లిన సిద్దిపేటకు చెందిన శ్రీనివాస్ లక్ష్మీ దంపతులు వెంట తీసుకువచ్చిన బంగారు ఆభరణాల బాక్స్ క్యూ లైన్ లో పడిపోగా అదే సమయంలో విధులు నిర్వర్తిస్తున్న శ్రీశైలం అనే హోంగార్డు బంగారు చెవి కమ్మలు ఉన్న అట్టి బాక్సును పోగొట్టుకున్న వారి వివరాలు సేకరించి ఆలయ అధికారుల సమక్షంలో అందజేశారు.ఈ సందర్భంగా హోంగార్డు శ్రీశైలం ను ఆలయ అధికారులు శ్రీనివాస్ లక్ష్మీ దంపతులు అభినందించారు కృతజ్ఞతలు చెప్పారు.
