ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి
చెక్ పోస్ట్ లలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది ప్రతినిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలి 👉ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి 👉జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ మార్చ్ 29 సీ కె న్యూస్ బాపట్ల చెక్ పోస్ట్ విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతినిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశించారు. మార్చి 28 న గురువారం జిల్లా ఎస్పీ చెక్ పోస్ట్ లలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందిని …
చెక్ పోస్ట్ లలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది ప్రతినిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలి
👉ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి
👉జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్
మార్చ్ 29 సీ కె న్యూస్ బాపట్ల
చెక్ పోస్ట్ విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతినిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశించారు. మార్చి 28 న గురువారం జిల్లా ఎస్పీ చెక్ పోస్ట్ లలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడినారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నగదు, అక్రమ మద్యం, ప్రజలను ప్రలోభాలకు గురిచెయ్యడానికి అవకాశం ఉన్న వస్తువుల తరలింపును అడ్డుకునేందుకు బాపట్ల జిల్లాలో ప్రస్తుతం మొత్తం 12 చెక్ పోస్ట్ లను ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు.
ఇతర జిల్లాల సరిహద్దులలో 9 చెక్ పోస్ట్ లు, జిల్లాలో అంతర్గతంగా ప్రధానమైన ప్రదేశాలలో మరో 3 చెక్ పోస్ట్ లను ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. చెక్ పోస్ట్ ల యందు రోజువారి మూడు షిఫ్టులలో పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ 24 గంటలు అప్రమత్తంగా వుండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. వీరు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, తనిఖీ చేసిన వాహన వివరాలను నమోదు చేసుకుంటారన్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లొద్దని, ఒకవేళ అవసరాల రీత్యా తీసుకెళ్తే సంబంధిత ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలను అధికారులకు చూపించాలన్నారు.
ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నియమావళిని పాటిస్తూ వాహనాల తనిఖీల సమయంలో చెక్ పోస్ట్ పోలీసులకు సహకరించాలని తెలిపారు.
జిల్లాలోకి ఎలాంటి అక్రమ మద్యం, నగదు, ప్రలోభాలకు గురిచేసే వస్తువుల రవాణా జరగకుండా అడ్డుకట్ట వేయటమే లక్ష్యంగా పోలీస్ అధికారులు, సిబ్బంది చెక్ పోస్ట్ లలో విధులు నిర్వహించాలన్నారు. నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనకి చేయాలన్నారు.
ఆర్టీసీ బస్సులు ,ప్రభుత్వ వాహనాలపై ఎలాంటి అనుమానం కలిగిన తక్షణమే తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా 50 వేలకు మించి ఎక్కువ నగదును తరలిస్తుంటే వాటిని సీజ్ చెయ్యాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లలో పోలీసు అధికారులు, సిబ్బంది ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ప్రధాన రహదారులు, కూడళ్ల ద్వారా వెళ్తున్న బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగదు, అక్రమ మద్యం, ప్రజలను ప్రలోభపెట్టె వస్తువులను సీజ్ చేస్తున్నాట్లు చెప్పారు.