బీజేపీ అధికార ప్రతినిధిగా తునికి దశరథ బీజేపీ అభివృద్ధి కి తనవంతు కృషి చేస్తా……దశరథ సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 30 యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ఆలేరు పట్టణానికి చెందిన తునికి దశరథ నియామకం అయ్యారు. శనివారం భువనగిరి అపార్టీ జిల్లా కార్యలయంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ తునికి దశరథ కు నియామక పత్రం అందచేశారు.ఈ సందర్బంగా తునికి దశరథ మాట్లాడుతూ..ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న …

బీజేపీ అధికార ప్రతినిధిగా తునికి దశరథ

బీజేపీ అభివృద్ధి కి తనవంతు కృషి చేస్తా……దశరథ

సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 30

యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ఆలేరు పట్టణానికి చెందిన తునికి దశరథ నియామకం అయ్యారు.

శనివారం భువనగిరి అపార్టీ జిల్లా కార్యలయంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ తునికి దశరథ కు నియామక పత్రం అందచేశారు.ఈ సందర్బంగా తునికి దశరథ మాట్లాడుతూ..ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పై పోరాడుతమాన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు తీర్చడంలో గత ప్రభుత్వం నేటి ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆరోపించారు.నిరుద్యోగుల సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతానని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో యువత సమస్యపై పోరాడుతానని,బీజేపీ అభివృద్ధి కి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

నా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఊట్కూరు అశోక్,రాష్ట్ర ఓబిసి కార్యదర్శి కమిటీ కారి కృష్ణ,ఆలేరు పట్టణ అధ్యక్షులు నంద గంగేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సముద్రాల ఐడియా శ్రీనివాస్,జిల్లా కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి బందెల సుభాష్,శ్రీనివాస్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated On 30 March 2024 1:22 PM IST
cknews1122

cknews1122

Next Story