వన్య ప్రాణులను రక్షించాలి...జింక మృతికి అధికారులే బాధ్యత వహించాలి కొడారి వెంకటేష్. సామాజిక కార్యకర్త సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 30 యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అభయారణ్యం లో శనివారం వీధి కుక్కలు జింక పై దాడి చేసి చంపి తిన్న సంఘటన చాలా బాధాకరమైన సంఘటన అని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర …

వన్య ప్రాణులను రక్షించాలి...
జింక మృతికి అధికారులే బాధ్యత వహించాలి
కొడారి వెంకటేష్. సామాజిక కార్యకర్త
సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 30
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అభయారణ్యం లో శనివారం వీధి కుక్కలు జింక పై దాడి చేసి చంపి తిన్న సంఘటన చాలా బాధాకరమైన సంఘటన అని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి నృసింహ అభయారణ్యం పేరుతో లక్షల రూపాయలు ఖర్చుచేసి వన్యమృగ సంరక్షణ కేంద్రంను రాయగిరి సమీపంలో ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.
అధికారుల పర్యవేక్షణ, సెంట్రీ కాపలాతో వన్య ప్రాణులకు నిరంతరం రక్షణ కల్పించాలి.కానీ గత కొంత కాలంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా వన్య ప్రాణులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన అన్నారు. సెంట్రీ ల నిర్లక్ష్యం కారణంగానే ఊర కుక్కలు అభయారణ్యం లోకి ప్రవేశించి జింక ను వేటాడాయని ఆయన ఆరోపించారు.
సెంట్రీ డ్యూటీ చేసే వారు అభయారణ్యం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను నిరంతరం పరిశీలించాలని, బయటి జంతువులు లోనికి రాకుండా,లోపటి జంతువులు బయటకు వెళ్ళకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు.వేసవిలో వన్య ప్రాణులకు నీటి వసతి, నీడ వసతి, ఫెన్సింగ్ లాంటి సమస్యలు లేకుండా అధికారులు చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
వన్య ప్రాణి జింక మృతికి కారణమైన వారిని గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆయన కోరారు.
