— పోడు భూముల విషయంలో రగడ
— పోలీస్ లను సైతం లెక్కచేయని గిరిజనులు
— అడ్డుకుంటున్న అధికారులపై కర్రల దాడి
సికె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.
సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామపంచాయతీ పరిధిలోని చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. పోడు భూముల విషయంలో రెండు గిరిజ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో అడ్డుకున్న పోలీసులపై గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు.
గిరిజనుల దాడిలో సత్తుపల్లి సి ఐ కిరణ్ తో సహా మరో నలుగురు పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
గత కొంతకాలంగా చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలోని పోడు భూముల విషయంలో గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో నేడు బుగ్గపాడు,చంద్రాయపాలెం గ్రామానికి చెందిన గిరిజనులు మధ్య వాగ్వాదం జరుగుతూ ఉండటం తో విషయం తెలుసుకున్న సత్తుపల్లి పోలీసులు అటవీ ప్రాంతానికి వెళ్ళగానే పోలీసులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు.సీఐ కిరణ్ పై గిరిజనులు కర్రలతో దాడి చేశారు.
సీఐ ను కాపాడేందుకు ప్రయత్నించిన మరో నలుగురు సిబ్బందిపై కూడా గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు.గిరిజనుల దాడి నుండి అతి కష్టం పై సీఐ తప్పించుకుని బయటపడ్డారు. తదనంతరం పోలీస్ వారు సుమారుగా 30 నుంచి 40 మంది గిరిజనులు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.