కేసీఆర్‌కు షాక్... వాహనంలో అణువణువూ సోదా లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి- ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి వలసల బెడదను ఎదుర్కొంటోంది. సీనియర్లు సైతం కేసీఆర్, ఆయన పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో చేరుతున్నారు.ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనడానికి సమాయాత్తం అయ్యారు కేసీఆర్. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. నీరు అందక ఎండిపోతున్న పంటలను పరిశీలించడానికి ఉద్దేశించిన …
![కేసీఆర్ వాహనంలో అణువణువూ సోదా కేసీఆర్ వాహనంలో అణువణువూ సోదా](https://cknewstv.in/wp-content/uploads/2024/03/policecheckkcrsvehicle1-1711877497.webp)
కేసీఆర్‌కు షాక్... వాహనంలో అణువణువూ సోదా
లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి- ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి వలసల బెడదను ఎదుర్కొంటోంది.
సీనియర్లు సైతం కేసీఆర్, ఆయన పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో చేరుతున్నారు.ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనడానికి సమాయాత్తం అయ్యారు కేసీఆర్. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. నీరు అందక ఎండిపోతున్న పంటలను పరిశీలించడానికి ఉద్దేశించిన పర్యటనలు ఇవి.
కరవుతో బారిన పడ్డ రైతన్నలను పరామర్శించడం, వారిలో ధైర్యం నింపడానికి ఆయన ఈ పర్యటన చేపట్టారు.ఈ ఉదయం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పర్యటించారు. అక్కడ రైతులను పరామర్శించారు. ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు.
రైతన్నలతో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని అరవపల్లికి బయలుదేరి వెళ్లారు. దీని తరువాత ఆయన నల్గొండ జిల్లా హాలియా మండలంలో పర్యటిస్తారు.
అరవపల్లికి వెళ్తోన్న సమయంలో సూర్యాపేట్ వద్ద పోలీసులు ఆయన వాహనాన్ని తనిఖీ చేశారు. అణువణువూ సోదా చేశారు.
సూర్యాపేట్ చెక్‌పోస్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న కారణంగా ఆయన వాహనాన్ని తనిఖీ చేయాల్సి వచ్చింది.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)