మెడికల్ కాలేజ్ లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
మెడికల్ కాలేజ్ లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్. రాజేశ్వర రావు తెలిపారు. ఖాళీ పోస్టుల్లో ప్రొఫెసర్లు - 6, అసోసియేట్ ప్రొఫెసర్లు - 13, అసిస్టెంట్ ప్రొఫెసర్లు - 6, సీనియర్ రెసిడెంట్ - 18 పోస్టులు ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ ఖాళీలను వాక్ ఇన్ …
మెడికల్ కాలేజ్ లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్. రాజేశ్వర రావు తెలిపారు.
ఖాళీ పోస్టుల్లో ప్రొఫెసర్లు - 6, అసోసియేట్ ప్రొఫెసర్లు - 13, అసిస్టెంట్ ప్రొఫెసర్లు - 6, సీనియర్ రెసిడెంట్ - 18 పోస్టులు ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ ఖాళీలను వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిన ఎంపిక చేయబడతాయని ప్రిన్సిపాల్ తెలిపారు.
ఏప్రిల్ 3న ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉదయం 10.00 గంటల నుండి వాక్ ఇన్ ఇంటర్వ్యూ లు నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు.
ఖాళీలు, ఇతర వివరాలు కళాశాల వెబ్ సైట్ www.gmckhammam.gov, జిల్లా వెబ్ సైట్ https: khammam.telangana.gov.in నందు పొందుపర్చినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
దరఖాస్తులు ఆన్లైన్, ఆఫ్ లైన్ లోనూ స్వీకరిస్తారని ఆయన అన్నారు. దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూ ద్వారా జిల్లా సెలక్షన్ కమిటీ నేతృత్వంలో ఎంపిక చేసి, నియామకపు పత్రాలను అందజేయనున్నట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.