ఓసారి సస్పెండ్ అయిన బుద్దిరాలేదు… మరోసారి ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన SI హైదరాబాద్‌ 2 సంత్సరాల క్రితం లంచానికి ఆశపడిన ఓ ఎస్సై సివిల్ ఇష్యూలో వేలు పెట్టాడు. ఆ విషయం అధికారులకు తెలియటంతో సస్పెండ్ చేశారు. ఆ తర్వాత తిరిగి జాబ్‌లో చేరినా.. బుద్ధి మాత్రం మారలేదు. తాజాగా.. ఓ ల్యాండ్ విషయంలో లంచం డిమాండ్ చేసి ACBకి చిక్కాడు. మీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ACB …

ఓసారి సస్పెండ్ అయిన బుద్దిరాలేదు… మరోసారి ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన SI

హైదరాబాద్‌ 2 సంత్సరాల క్రితం లంచానికి ఆశపడిన ఓ ఎస్సై సివిల్ ఇష్యూలో వేలు పెట్టాడు. ఆ విషయం అధికారులకు తెలియటంతో సస్పెండ్ చేశారు. ఆ తర్వాత తిరిగి జాబ్‌లో చేరినా.. బుద్ధి మాత్రం మారలేదు.

తాజాగా.. ఓ ల్యాండ్ విషయంలో లంచం డిమాండ్ చేసి ACBకి చిక్కాడు. మీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ACB అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన షేక్‌ నజీముద్దీన్‌ నాదర్‌గుల్‌లో 200 గజాల ప్లాటు ఉంది.

దాన్ని గుర్రంగూడకు చెందిన మాదాని సుభాష్‌కు రూ.4.80 లక్షలకు విక్రయించాలని ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్ కింద రూ.2.10 లక్షలు కూడా తీసుకున్నాడు. తర్వాత పలు కారణాల వల్ల నజీముద్దీన్ ఆ ఫ్లాట్ అమ్మకూడదని అనుకున్నాడు.

సుభాష్‌కు ఫోన్‌ చేసి ప్లాట్‌ను అమ్మనని.. తీసుకున్న నగదు ఇస్తానని.. అగ్రిమెంట్ పేపర్లు తిరిగివ్వాలని కోరాడు. అందుకు సుభాష్ ససేమేరా అనడంతో నజీముద్దీన్‌ మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు.

రంగంలో దిగిన ఎస్‌ఐ సైదులు సుభాష్‌ను పిలిపించి డబ్బులు తీసుకుని డాక్యూమెంట్స్ ఇవ్వాలని, లేనిపక్షంలో అక్రమ కేసు పెట్టి.. జైల్లో వేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఎస్ఐ హెచ్చరికతో భయపడ్డ సుభాష్‌.. ఇచ్చిన మొత్తంతో పాటు అదనంగా రూ.1.40 లక్షలు తీసుకుని నజీముద్దీన్‌కు ల్యాండ్ డాక్యూమెంట్స్ ఇచ్చాడు.

అయితే సుభాష్‌కు అదనంగా మనీ వచ్చాయి కాబట్టి.. తనకు రూ.20 వేలు ఇవ్వాలని ఎస్ఐ డిమాండ్‌ చేశాడు. రూ.10 వేలు ఇచ్చేందుకు ఒప్పుకొన్న సుభాష్‌.. అనంతరం తనను బెదిరించిన ఎస్సై అంతు చూసేందుకు ఏసీబీని ఆశ్రయించాడు.

ఈ మేరకు పక్కాగా ప్రణాళిక రూపొందించిన ఏసీబీ అధికారులు.. స్టేషన్ ఆవరణలో SI సైదులుకు రూ. 10 వేలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్ఐ ఇంట్లో కూడా సోదాలు చేశారు.

గతంలో పీఎస్‌లో పనిచేస్తున్నప్పుడు సివిల్‌ ఇష్యూలో తలదూర్చి సైదులు సస్పెండయ్యాడు. తాజాగా మరోసారి ACB అధికారులకు చిక్కాడు.

Updated On 1 April 2024 1:03 PM IST
cknews1122

cknews1122

Next Story