గుంతకల్లు రైల్వే ఆసుపత్రిలో సిఎంఎస్ లంచావతారం..? 1 ఏప్రిల్ గుంతకల్ నియోజకవర్గం రిపోర్టర్ (రాజు) గుంతకల్ సమాచార్ :- దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్లోని అతిపెద్ద రైల్వే హాస్పిటల్లో ఆసుపత్రి సిఎంఎస్ గజలక్ష్మి ప్రభావతి లంచాఅవతారం ఎత్తరని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే ఆసుపత్రిలో సఫాయి వాలాలను ఇతర శాఖ విభాగాలకు మళ్లించాలన్న నిబంధనలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే ఆసుపత్రిలో పనిచేస్తున్న 24 మంది సఫాయి వాలాలలో …

గుంతకల్లు రైల్వే ఆసుపత్రిలో సిఎంఎస్ లంచావతారం..?

1 ఏప్రిల్ గుంతకల్ నియోజకవర్గం రిపోర్టర్ (రాజు)

గుంతకల్ సమాచార్ :- దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్లోని అతిపెద్ద రైల్వే హాస్పిటల్లో ఆసుపత్రి సిఎంఎస్ గజలక్ష్మి ప్రభావతి లంచాఅవతారం ఎత్తరని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే ఆసుపత్రిలో సఫాయి వాలాలను ఇతర శాఖ విభాగాలకు మళ్లించాలన్న నిబంధనలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ నేపథ్యంలోనే రైల్వే ఆసుపత్రిలో పనిచేస్తున్న 24 మంది సఫాయి వాలాలలో సీనియర్లకు సముచిత న్యాయం చేయాలని సిఎంఎస్, ఏసిఎంఎస్, స్టేనో అధికారులకు విన్నవించుకున్నారు. అయితే అధికారులు వారి మాటలను పెడచెవిన పెట్టి స్క్రీనింగ్ పేరుతో మాయమాటలు చెప్పి మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

21 సంవత్సరాలుగా పనిచేస్తున్న సఫాయివాలాలను కాకుండా కొత్తగా విధులను నిర్వహిస్తున్న జూనియర్ సఫాయివాలాలకు రైల్వే ఆసుపత్రిలో అటెండర్ పోస్టులను అప్పనంగా కట్టబెట్టడంపై పలు విమర్శలకు దారితీస్తుందని మండిపడ్డారు.

పైగా సీఎంఎస్ గజలక్ష్మి ప్రభావతి న్యాయం చేస్తామని చెప్పి ఆమె బదిలీ వెళ్తున్న సమయంలో జూనియర్ సఫాయివాలాలకు అటెండర్ పోస్టులను కట్టబెట్టడం అన్యాయమని సీనియర్ సఫాయివాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైల్వే ఆసుపత్రి సీఎంఎస్ లంచం తీసుకుని జూనియర్ సఫాయి వాలాలకు అటెండర్ పోస్టులను కట్టబెట్టారని సీనియర్ సఫాయి వాలాలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే డివిజనల్ అధికారులు స్పందించి విచారణ చేసి సీనియర్ సఫాయివాలాలకే మొదట ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated On 1 April 2024 8:03 PM IST
cknews1122

cknews1122

Next Story