సెయింట్ పీటర్స్ పాఠశాల విద్యార్థికి నవోదయ సీటు
సెయింట్ పీటర్స్ పాఠశాల విద్యార్థికి నవోదయ సీటు సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 01 యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి గండికోట యశ్వంత్ 2024 -25 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయం చలకుర్తిలో సీటు పొందారు. ఈ సందర్భంగా మోటకొండూరు సెయింట్ పీటర్స్ పాఠశాల యాజమాన్యం విద్యార్థిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ మీసాల రాజయ్య కరెస్పాండెంట్ కానుకుంట్ల …

సెయింట్ పీటర్స్ పాఠశాల విద్యార్థికి నవోదయ సీటు
సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 01
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి గండికోట యశ్వంత్ 2024 -25 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయం చలకుర్తిలో సీటు పొందారు.
ఈ సందర్భంగా మోటకొండూరు సెయింట్ పీటర్స్ పాఠశాల యాజమాన్యం విద్యార్థిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ మీసాల రాజయ్య కరెస్పాండెంట్ కానుకుంట్ల రవీందర్ మాట్లాడుతూ మోటకొండూరు మండలంలో గత 19 సంవత్సరాల క్రితం స్థాపించి ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దిన ఘనత సెయింట్ పీటర్స్ పాఠశాల అని అన్నారు.ఇంకా భవిష్యత్తులో మరేందరో విద్యార్థులను మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు.
బాగా కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సేయింట్ పీటర్స్ పాఠశాల ప్రిన్సిపాల్ మీసాల రాజయ్య కరస్పాండెంట్ కానుకంట్ల రవీందర్ మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
