మై హోమ్ సిమెంట్స్ లో కొనసాగుతున్న వెంకటేశ్వర స్వామి వారి 26వ బ్రహ్మోత్సవములు
శోభాకృత నామ సంవత్సరం చాలా చారిత్రాత్మకమైనది
ఈ దేశానికి మానవజాతికి ఆదర్శమైన వారు రాముడు
శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఏప్రిల్ 01
శ్రీ భూదా దేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి 26వ బ్రహ్మోత్సవములు మై హోమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ శ్రీనగర్ కాలనీ మేళ్లచెరువులో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో కళ్యాణ బ్రహ్మోత్సవములు 4 రోజు సోమవారం ఉదయం 5-30 గంటల నుండి 12-30 వరకు ద్వార తోరణం ధ్వజ కుంభం రాదనము వేద ఇతిహాస పురాణ స్తోత్ర దివ్య ప్రబంధ నారాయణములు మూలమంత్ర వాహనము నిత్య పూర్ణాహుతి దిక్పాలురకు బలి ప్రధానం మంగళ శాసనములు తీర్థ ప్రసాద గోష్టి అహోబిత స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎదుర్కోలు జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ శోభ కృత నామ సంవత్సరం చాలా చారిత్రాత్మక సంవత్సరం అని ఈ దేశానికి మానవజాతికి ఆదర్శమైనటువంటి రాముడు తన స్థానం నుంచి దూరం చేయబడితే 500 ఏండ్ల తర్వాత మళ్లీ తన స్థానానికి చేరి ప్రతిష్ట జరిగిన ఏడాది అంటే చరిత్రలో 500 ఏండ్లుగా తన స్థావరానికి అవకాశం లేని ఎవడు సాహసం చేయని ఒక అద్భుతమైన కార్యం ఈ శోభాకృత నామ సంవత్సరంలో జరిగింది.
ఆ రకంగా ఈ సంవత్సరం చాలా గొప్పది. దాన్ని మన భారత ప్రధాని వారి టీం అందరూ కలిసి జరిపిన తీరు ఇదొక ఇతిహాసాన్ని నెలకొల్పిన సంవత్సరం మనం ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకు వస్తే మన అందరికీ పరిచయం కార్యక్రమాలన్నీ కూడా శ్రీమన్నాచార్యులు కుడుంబయ్
ఈ కార్యక్రమాలు చేస్తుండేవారు ఇప్పుడు వారు లేకపోయినా వారి కుమారులు చిరంజీవి వెంకటకృష్ణ శ్రీమాన్ రంగనాథ్ వారి బృందం తోడ్పడు తోటి ఈ బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం శుభదాయకం అని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మొదటి నుండి కూడా జరిపిస్తున్న పెద్దలలో ఒకరైన శ్రీ రంగరాజ వల్లభ స్వామి స్వామివారికి ఎదురుకోలు విషయంలో చిన్నారులతో కలిసి ఎంతో చక్కగా అమ్మవారిని సారె పెట్టి సాగనంపాలంటే ఆ అమ్మవారిని చేతుల్లోకి తీసుకొని తానే జాగ్రత్తగా అందంగా ఆమె సౌఖ్యానికి తగ్గట్టుగా తండ్రి తన బిడ్డను అయ్యవారి చేతుల్లో పెడుతుంటే ఎంత మానసికమైన దీన స్థితి తోటి ఉంటారో అంత భావన ఆయన పొందుతూ ఆ అమ్మవారిని సాగనంపారని అన్నారు అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం వారు బ్రహ్మోత్సవాలలో పాల్గొని చక్కగా జరిపిస్తున్నారని అన్నారు . అనంతరం మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో 20 సంవత్సరముల నుండి 20 సంవత్సరములకు పనిచేస్తున్న ఉద్యోగులను మేనేజింగ్ డైరెక్టర్ రామేశ్వరరావు దంపతులు కుటుంబ సభ్యులు అభినందిస్తూ వారికి మెడల్స్ ను అందజేశారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో ఫ్యాక్టరీ ఉద్యోగస్తులకు అక్కడకు విచ్చేసిన భక్తులకు చిన్న జీయర్ స్వామి వారి చేతుల మీదుగా క్యాలెండర్ ను అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మునగాల రామ్మోహన్ రావు అరుణ యూనిట్ శ్రీనివాసరావు అనురాధ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజగోపాల్ పూజారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు