హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు…
డీఈఓ ఉత్తర్వులు జారీ
తల్లాడ మండలంలోని మల్సూర్ తండా ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అన్నపూర్ణపై సస్పెండ్ వేటు పడింది.
పాఠశాల ఆవరణలో అనుమతి లేకుండా గ్రామపంచాయతీ భవనం నిర్మించడంతో హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు.
ఈ నేపథ్యాన ఆమెను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. ఇటీవల మల్సూరుతండా ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసిన విషయం తెల్సిందే.