జొమాటో బాయ్ ద్వారా నగదు రవాణా.. రూ.75 లక్షల నగదు సీజ్ హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా పట్టుబడింది. మూడు ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో రూ.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో జొమాటో డెలివరీ బాయ్ నగదు రవాణా చేయడం తీవ్ర కలకలం రేపింది. నగదు పట్టివేతకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. కారులో రూ.40 లక్షలు అబిడ్స్ పోలీస్ పరిధిలో గల రామకృష్ణ థియేటర్ పార్కింగ్ వద్ద ఎండీవర్ …
![జొమాటో బాయ్ ద్వారా భారీ నగదు రవాణా.. జొమాటో బాయ్ ద్వారా భారీ నగదు రవాణా..](https://cknewstv.in/wp-content/uploads/2024/04/IMG-20240405-WA0119.jpg)
జొమాటో బాయ్ ద్వారా నగదు రవాణా..
రూ.75 లక్షల నగదు సీజ్
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా పట్టుబడింది. మూడు ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో రూ.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో జొమాటో డెలివరీ బాయ్ నగదు రవాణా చేయడం తీవ్ర కలకలం రేపింది. నగదు పట్టివేతకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు.
కారులో రూ.40 లక్షలు
అబిడ్స్ పోలీస్ పరిధిలో గల రామకృష్ణ థియేటర్ పార్కింగ్ వద్ద ఎండీవర్ కారును తనిఖీ చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా రూ.40 లక్షల నగదు పట్టుబడింది.
కారులో ఉన్న ఇద్దరు దేవిని ముత్యాలు, రాజేష్‌ను అరెస్ట్ చేశారు. హఫీజ్ పేటకు చెందిన విల్సన్ బాబు వద్ద పనిచేస్తున్నామని ఆ ఇద్దరు పోలీసులకు తెలిపారు. విల్సన్ సూచనతో ఓ వ్యక్తి నుంచి నగదు తీసుకున్నామని వివరించారు.
డెలివరీ బాయ్ వద్ద రూ.14 లక్షలు
ఆసిఫ్ నగర్‌లో గల మల్లెపల్లి సర్కిల్ వద్ద ఉన్న అమృత వైన్స్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. జొమాటో డెలివరీ బాయ్ నుంచి రూ.14 లక్షల నగదు లభించింది.
ఆ నగదుకు సంబంధించి డిటైల్స్ లేకపోవడంతో సీజ్ చేశారు. కడపకు చెందిన నాగార్జున హైదరాబాద్ వచ్చి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడని వివరంచారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)