ట్రాక్టర్‌ డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ బ్లూ కోల్ట్స్‌ పోలీసులు జరిమానా విధించిన ఘటన పాల్వంచ మండలం నాగారంలో చోటు చేసుకుంది.ఓ ట్రాకర్ట్ నాగారం నుంచి పాల్వంచ వైపు మట్టిలోడ్‌తో వస్తోంది. మార్గమధ్యలో ఆపిన బ్లూ కోల్ట్స్‌ పోలీసులు ట్రాక్టర్‌ డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ వంద రూపాయలు జరిమానా విధించారు. అయితే, ట్రాక్టర్‌కు సీటు బెల్టు ఉండదని పోలీసులకు చెప్పినా వినిపించుకోకుండా జరిమానా విధించారని డ్రైవర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. వెహికల్‌కు సంబంధించి అన్ని పత్రాలు …

ట్రాక్టర్‌ డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ బ్లూ కోల్ట్స్‌ పోలీసులు జరిమానా విధించిన ఘటన పాల్వంచ మండలం నాగారంలో చోటు చేసుకుంది.ఓ ట్రాకర్ట్ నాగారం నుంచి పాల్వంచ వైపు మట్టిలోడ్‌తో వస్తోంది.

మార్గమధ్యలో ఆపిన బ్లూ కోల్ట్స్‌ పోలీసులు ట్రాక్టర్‌ డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ వంద రూపాయలు జరిమానా విధించారు. అయితే, ట్రాక్టర్‌కు సీటు బెల్టు ఉండదని పోలీసులకు చెప్పినా వినిపించుకోకుండా జరిమానా విధించారని డ్రైవర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

వెహికల్‌కు సంబంధించి అన్ని పత్రాలు చూపించాలని ట్రాక్టర్ యాజమానిని ప్రశ్నించగా.. అతడు అన్ని పత్రాలను వారికి చూపించాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. అన్ని ఉన్నాయ్.. సరే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీటు బెల్టు ఎందుకు పెట్టుకోలేదంటూ పాల్వంచ ఎస్సై ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫైన్ వేశాడు.

ఈ క్రమంలోనే బాధితుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అసలు ట్రాక్టర్‌కు సీడు బెల్టు ఉండదంటూ.. మొత్తుకున్నాడు. క్లారిటీ కోసం ట్రాక్టర్ షోరూంకి బాధితుడు ఫోన్ చేయగా అసలు ట్రాక్టర్‌కు సీటు బెల్టు ఉండదని వాళ్లు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో బాధితుడు పోలీసులపై ఫైర్ అయ్యాడు.

కనీస అవగాహన లేకుండా తనిఖీల పేరుతో వాహనదారులుకు ఫైన్ వేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇదేక్కడి ఇచ్చంత్రం ముచ్చటరా అయ్యా! అంటూ నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.

Updated On 5 April 2024 1:29 PM IST
cknews1122

cknews1122

Next Story