కాంగ్రెస్ సభలో పోలీసుల అత్యుత్సాహం.. భట్టి విక్రమార్క కాన్వాయ్ డ్రైవర్‌పై చేయి చేసుకున్న సీపీ ఆపై వీడియో గ్రాఫర్ పై దురుసు ప్రవర్తన తుక్కుగూడ 'జన జాతర' భారీ బహిరంగ సభకు నేడు(శనివారం) కాంగ్రెస్ (Congress) పిలుపునిచ్చిది. ఈ బహిరంగ సభలో రాచకొండ పోలీస్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కాన్వాయిని అనుమతించకుండా అడ్డుకున్నారు. డిప్యూటీ సీఎం సిబ్బంది చెబుతున్న వినకుండా అడ్డుపడ్డారని చెప్పారు. డిప్యూటీ సీఎం వాహనమని చెప్పినా …

కాంగ్రెస్ సభలో పోలీసుల అత్యుత్సాహం..

భట్టి విక్రమార్క కాన్వాయ్ డ్రైవర్‌పై చేయి చేసుకున్న సీపీ

ఆపై వీడియో గ్రాఫర్ పై దురుసు ప్రవర్తన

తుక్కుగూడ 'జన జాతర' భారీ బహిరంగ సభకు నేడు(శనివారం) కాంగ్రెస్ (Congress) పిలుపునిచ్చిది. ఈ బహిరంగ సభలో రాచకొండ పోలీస్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కాన్వాయిని అనుమతించకుండా అడ్డుకున్నారు. డిప్యూటీ సీఎం సిబ్బంది చెబుతున్న వినకుండా అడ్డుపడ్డారని చెప్పారు.

డిప్యూటీ సీఎం వాహనమని చెప్పినా వినలేదని సభలోకి వెళ్లడానికి వాహనానికి డయాస్ పాస్ ఉందని చెబుతుండగా వినిపించుకోకుండా డ్రైవర్ శ్రీనివాస్‌పై రాచకొండ సీపీ చేయి చేసుకున్నారు.


డ్రైవర్ సమాధానం చెబుతుండగా వినిపించుకోకుండా తీవ్ర ఆగ్రహంతో జేబులో ఉన్న ఐడి కార్డును సీపీ గుంజుకున్నారు. సభ ప్రాంగణంలోకి వాహనాన్ని అనుమతించకుండా పోలీసులు వాహనాన్ని పక్కన నిలిపివేశారు.

సమస్య సద్దుమణిగి అరగంట తర్వాత తిరిగి డ్రైవన్‌ని పిలిపించి చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీపీతో డ్రైవర్ శ్రీనివాస్‌ని సీపీ కొట్టించారు. డ్రైవర్‌పై పోలీసుల దాడిని చిత్రీకరిస్తున్న వీడియో గ్రాఫర్ మొబైల్‌ను గుంజుకొని అతనిపై కూడా పోలీసులు దాడి చేశారు.

Updated On 6 April 2024 11:37 PM IST
cknews1122

cknews1122

Next Story