మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన లారీ… హైదరాబాద్‌లోని మెట్రో రెడ్‌లైన్‌లోని పిల్లర్‌ను లారీ ఢికొట్టింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ యాక్సిడెంట్ జరింగింది. సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ మెట్రో పిల్లర్‌ను ఢీకొన్నింది. దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న 16 టైర్ల లారీ పంజాగుట్ట దగ్గర మెట్రో పిల్లర్ 11108ను ఢీ కొట్టింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదంతో …
![మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన లారీ… మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన లారీ…](https://cknewstv.in/wp-content/uploads/2024/04/n5980384361712425031736bfedf35ee62099d21bec20b7575b3f4bc78163f429d2899b124adaf15124539c.jpg)
మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన లారీ…
హైదరాబాద్‌లోని మెట్రో రెడ్‌లైన్‌లోని పిల్లర్‌ను లారీ ఢికొట్టింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ యాక్సిడెంట్ జరింగింది. సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ మెట్రో పిల్లర్‌ను ఢీకొన్నింది.
దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న 16 టైర్ల లారీ పంజాగుట్ట దగ్గర మెట్రో పిల్లర్ 11108ను ఢీ కొట్టింది.
డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదంతో ఖైరతాబాద్ పంజాగుట్ట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు భారీ క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసే ఏర్పాట్లు చేశారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)