లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఎస్ఐ.. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించించారు. ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై రంజిత్‌, రైటర్‌ విక్రమ్‌ ఏసీబీ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీసులు లంచం వ్యవహారంపై విచారిస్తున్నారు. మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై రెండు రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఎస్సై, …

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఎస్ఐ..

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించించారు.

ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై రంజిత్‌, రైటర్‌ విక్రమ్‌ ఏసీబీ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీసులు లంచం వ్యవహారంపై విచారిస్తున్నారు.

మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై రెండు రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఎస్సై, రైటర్‌ అవినీతి వ్యవహారం బయటపడినట్లు సమాచారం.

Updated On 6 April 2024 5:12 PM IST
cknews1122

cknews1122

Next Story