ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రులపై DMHO ఉక్కు పాదం వరుస సీజ్ లు , షోకాజ్ నోటీసులు... ఈ రోజు ఖమ్మం పట్టణం లో గల మయూరి మల్టీ స్పెషలిటి ఆసుపత్రి ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి మాలతి, ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి సైదులు కలసి తమ సిబ్బంది తో ఆకస్మికంగా తనిఖీలు చేసి ఆలోపతిక చట్ట నిబంధనలు పాటించకుండా, ఆపరేషన్ థియేటర్ నందు ఉపయోగించిన వాయిల్స్, లోడెడ్ …

ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రులపై DMHO ఉక్కు పాదం

వరుస సీజ్ లు , షోకాజ్ నోటీసులు...

ఈ రోజు ఖమ్మం పట్టణం లో గల మయూరి మల్టీ స్పెషలిటి ఆసుపత్రి ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి మాలతి, ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి సైదులు కలసి తమ సిబ్బంది తో ఆకస్మికంగా తనిఖీలు చేసి ఆలోపతిక చట్ట నిబంధనలు పాటించకుండా,

ఆపరేషన్ థియేటర్ నందు ఉపయోగించిన వాయిల్స్, లోడెడ్ సిరంజెస్ ఉంచటం, అన్ని స్పెషలటీస్ కు వక్కటే ఆపరేషన్ తీయేటర్ ఉండటం, వెయిటింగ్ రూమ్ లేకపోవటం, స్త్రీ, పురుషులకు విడిగా టాయిలెట్ సౌకర్యం లేకపోవటం స్టీరిలై్సేషన్ బయట ఉండటం, వ్యాధులు శోకకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం, అవుట్ పేషెంట్ రిజిస్టర్ సరిగ్గా వ్రాయకపోవట, ఎం టీ పి పర్మిషన్ లేకపోయినా అబార్షన్లు జరుగుతుందడం,

ఈ ఎస్ ఐ పర్మిషన్ సర్టిఫికెట్, స్పెషలిటీ సర్వీస్ ల బోర్డు డిస్ప్లే ఉంచకపోవడం లాంటి ని గుర్తించి ఆసుపత్రి నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్నట్లు గుర్తించి, ఆపరేషన్ థియేటర్ ను సీస్ చేసి, పై విషయం లకు వివరణ ఇవ్వమని షో కాజ్ నోటీసు జారీ చేశారు.

అల్లోపతి క్ చట్టం నిబంధన లు పాటించక ఆసుపత్రి ని నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమం లో డిప్యూటీ డెమో సాంబశివ రెడ్డి, ఉపేందర్, నజీర్ లు పాల్గొన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఖమ్మం

Updated On 7 April 2024 5:35 PM IST
cknews1122

cknews1122

Next Story