BRS మాజీ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్.. ప్రజాభవన్ వద్ద జరిగిన కారు ప్రమాదం కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదం తర్వాత షకీల్ కుమారుడు రహేల్ దుబాయ్ పారిపోయాడు. దీంతో ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇన్ని రోజుల తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన రహేల్ను పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. గతేడాది డిసెంబర్ 23 అర్థరాత్రిలో ప్రజాభవన్ వద్ద ప్రమాదం జరిగింది. …

BRS మాజీ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్..

ప్రజాభవన్ వద్ద జరిగిన కారు ప్రమాదం కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదం తర్వాత షకీల్ కుమారుడు రహేల్ దుబాయ్ పారిపోయాడు.

దీంతో ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇన్ని రోజుల తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన రహేల్ను పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.

గతేడాది డిసెంబర్ 23 అర్థరాత్రిలో ప్రజాభవన్ వద్ద ప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ కారుతో వచ్చిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు రహేల్ బారికేడ్లను తొక్కుకుంటూ వెళ్లిపోయాడు.

కేసు నుంచి తప్పించుకోవడానికి తన స్థానంలో వేరే డ్రైవర్ను కూర్చోబెట్టాడు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

స్థానికులను విచారించిన పోలీసులు సిసిటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అనంతరం డ్రైవింగ్ చేసింది రహేల్ అని నిర్దారించారు. అప్పటికే డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేసి పరీక్షలు చేశారు. కారు బీభత్సం సృష్టించిన తర్వాత అందులో ఓ వ్యక్తి పరారైనట్టు గుర్తించారు.

ఈ ఎపిసోడ్లో పోలీసులతో ఎమ్మెల్యే అనుచరులు కుమ్మక్కై.. రహేల్ను తప్పించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ దిశగా పోలీసులు కేసు విచారిస్తే… సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రమాదం జరిగిన వెంటనే అతను దుబాయ్ పారిపోయినట్టు గుర్తించారు. దీంతో పోలీసులు ఆయనపై లుక్అవుట్ నోటీసులు ఇష్యూ చేశారు. దీనిపై రహేల్ తరఫున న్యాయవాదులు కోర్టును సైతం ఆశ్రయించినా వారికి ఊరట లభించలేదు.

ప్రమాదం జరిగిన తర్వాత రహేల్ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అయితే అక్కడకు షకీల్ అనుచరులు వచ్చి అతన్ని తీసుకెళ్లిపోయారు.

ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించాలని పోలీసులపై కూడా చర్యలు తీసుకుంది ప్రభుత్వం. పంజాగుట్ట సీఐనీ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

Updated On 8 April 2024 9:27 AM IST
cknews1122

cknews1122

Next Story