Cm రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు తప్పిన ప్రమాదం సీఎం రేవంత్‌ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. రేవంత్ కాన్వాయ్ లోని వాహనం టైర్ పంక్చర్ అయ్యింది. కాన్వాయ్ లో ఉన్న ఒక ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ ఒక్కసారిగా పేలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లే సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడా వద్ద ఈ ఘటన జరిగింది. అందరూ భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో అని షాక్ లో ఉండిపోయారు. …

Cm రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు తప్పిన ప్రమాదం

సీఎం రేవంత్‌ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. రేవంత్ కాన్వాయ్ లోని వాహనం టైర్ పంక్చర్ అయ్యింది. కాన్వాయ్ లో ఉన్న ఒక ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ ఒక్కసారిగా పేలింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లే సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడా వద్ద ఈ ఘటన జరిగింది. అందరూ భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో అని షాక్ లో ఉండిపోయారు. టైర్‌ పేలిందని తెలియడంతో అందరూ వాహనాల నుంచి బయటకు వచ్చారు.

పేలిన టైర్లు రిపేరి చేయడంతో మళ్లీ వాహనాలు కొడంగల్‌ కు బయలు దేరాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మొయినాబాద్ మీదుగా కొడంగల్ మీటింగ్ కు బయలు దేరారు.

గత నెల 17న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనిని పసిగట్టిన పైలట్లు సకాలంలో ల్యాండింగ్ చేశారు. అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ అదే విమానంలో ఉన్నారు. పైలట్ల చాకచక్యంతో వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.

అయితే మార్చిలోనే రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వేగంగా వెళ్తున్న కాన్వాయ్‌లో 6 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

అయితే కార్లలోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Updated On 8 April 2024 10:46 PM IST
cknews1122

cknews1122

Next Story