చెరువులో రైతుల పేరిట దళారులు మట్టిని తరలిస్తే వారిపై కేసులు
నీటిపారుదల శాఖ
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఏప్రిల్ 08
హుజూర్నగర్ మట్టంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల పరిధిలోని చెరువులలో రైతుల పేరుతో దళారులు మట్టిని అక్రమంగా తరలించి పెద్ద మొత్తంలో ప్రభుత్వ వనరులను దెబ్బతీయడం మరియు చెరువు శిఖం నందే మట్టిని పోసి చెరువుని ఆక్రమించడం జరుగుతుంది,
అదే విధంగా పెద్ద మొత్తంలో మట్టి నీ దళారులు ఇటుక బట్టి వ్యాపారులకు విక్రయిస్తూ నీటి పారుదల అనుమతి తోనే జరుగుతున్నట్లుగా ప్రచారం చేయడం నేరం అని ఈ రెండు మండల పరిధిలో నీటిపారుదల శాఖ నుండి మట్టి తోలుటకు గానీ చెరువు ఆక్రమించుటకు గానీ ఎటువంటి అనుమతులు జారీ చేయబడలేదు
కనుక తదుపరి జరుగు పరిణామాలకు నీటి పారుదల శాఖ బాధ్యత వహించదు,అలాంటి వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకొనబడునని మండల పరిధిలోని నాయకులు రైతులు మాకు సహకరించాలని నీటి పారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు.